అల్లుడు అద‌ర‌గొట్టాడుగా..!

అల్లుడు అంటే ఎవ‌రో ఈ పాటికే అర్థ‌మైపోయుంటుంది క‌దా..! ఇప్పుడు అల్లుడు అంటే ఒక్క‌డే.. అత‌డే చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ ద‌వే్. ఈయ‌న న‌టిస్తున్న తొలి సినిమా విజేత ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది బాగానే ఉంది. దీని గురించి కంటే కూడా ఇప్పుడు ఈయ‌న అప్పియ‌రెన్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

తొలి సినిమా క‌దా.. కాస్త బెరుకు భ‌యం ఉంటుందేమో అనుకున్నారు. స్క్రీన్ పై అది క‌నిపించినా కూడా స్టేజ్ పై మాత్రం క‌నిపించ‌లేదు. వెన‌క మామ ఉన్నా.. ముందు చాలా మంది అభిమానులున్నా.. ప‌దుల కొద్దీ కెమెరాలు ఫోక‌స్ చేస్తున్నా కూడా అల్లుడు త‌న స్పీచ్ తో అద‌ర‌గొట్టాడు. ఏ మాత్రం బెరుకు లేకుండా మాట్లాడి భేష్ అనిపించాడు. ఈ జోరు చూస్తుంటే ఇండ‌స్ట్రీలో పాతుకుపోడానికి గ‌ట్టిగా ఫిక్స్ అయిపోయి వ‌చ్చిన‌ట్లున్నాడు అల్లుడు.

త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన వాళ్లంద‌రికీ థ్యాంక్స్ చెబుతూనే.. త‌న‌లాంటి కొత్త వాళ్ల‌ను ఆద‌రించండి అంటూ విన‌యంగా ప్రేక్ష‌కుల‌ను కోరుకున్నాడు కూడా. ఈ తీరు చూస్తుంటే అల్లుడు కూడా మెగా హీరోల లిస్ట్ లో చేరిపోయేలా క‌నిపిస్తున్నాడు. మామ స‌పోర్ట్ తో పాటు సొంత టాలెంట్ కూడా చూపించేలా క‌నిపిస్తున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. క‌ళ్యాణ్ దేవ్ ఫ్యూచ‌ర్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here