అల్లుళ్ల‌ను అలా మేనేజ్ చేసిన చిరు..

మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఇప్పుడు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మేన‌ల్లుడితో పాటు చిన్న‌ల్లుడి సినిమా కూడా ఒకేరోజు వ‌స్తుంద‌నే వార్త‌లు ఆ మ‌ధ్య బాగా వినిపించాయి. క‌ళ్యాణ్ దేవ్ విజేత‌తో పాటు సాయిధ‌రంతేజ్ తేజ్ ఐ ల‌వ్ యూ జులై 6న విడుద‌ల కానున్నాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది.

ఈగ విడుద‌ల తేదీనే త‌న సినిమా విడుద‌ల చేయాల‌ని సెంటిమెంట్ తో విజేత‌ను ఆ రోజే తీసుకురావాల‌ని అనుకున్నాడు సాయి కొర్ర‌పాటి. అయితే ఇప్పుడు ఆ స‌స్పెన్స్ కు తెర‌ప‌డింది. అల్లుళ్లు ఇద్ద‌రూ ఒకేరోజు రావ‌డం లేద‌ని తేలిపోయింది. ఎందుకంటే అంద‌రి చెవుల‌కు తుప్పు వ‌దిలేలా చిరంజీవే ఈ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసాడు. విజేత సినిమా జులై 12న విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించాడు మెగాస్టార్.

విజేత ఆడియో లాంఛ్ లో ఈ చిత్రం క‌ళ్యాణ్ కెరీర్ కు మంచి పునాది కావాల‌ని కోరుకున్నాడు మెగాస్టార్. ఇక సాయిధ‌రంతేజ్ తేజ్ ఐ ల‌వ్ యూ జులై 6న రానుంది. ఇలా ఈ రెండూ వారం రోజుల గ్యాప్ లో రానున్నాయిప్పుడు. అయితే అల్లుళ్ల బాక్సాఫీస్ పోటీ మాత్రం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పుడు సినిమా బాగుంటే రెండూ మూడు వారాలు కూడా ఆడేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఒక్క వారం గ్యాప్ లోనే రెండు సినిమాలు వ‌స్తున్నాయి. మ‌రి వీటిలో ఏది బాక్సాఫీస్ విజేత‌గా నిలుస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here