అ.. అక్క‌డ అద‌ర‌గొడుతుందిగా..!

కొత్త‌ద‌నం ఉంటే తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారు. ఎన్నోసార్లు ఇది నిజ‌మైంది. ఇప్పుడు కూడా మ‌రోసారి అది ప్రూవ్ అవుతుంది. అ.. సినిమా విష‌యంలో ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కులు చూపిస్తున్న శ్ర‌ద్ధ చూసి ఇండ‌స్ట్రీ మొత్తం షాక్ అవుతుంది. తొలిరోజు ఈ చిత్రానికి టాక్ అంతా బాగా రాలేదు. అర్థం కాలేదు.. విచిత్ర‌మైన సినిమా.. ఇలాంటి సినిమాను నాని నిర్మించాడేంటి అన్నారు. కానీ ఎవ‌రూ చెత్త‌గా ఉంది అని మాత్రం అన‌లేదు. కొత్త‌గా ఉంద‌న్నారంతే. దాంతో ఆ కొత్త‌ద‌నం ఏంటో తాము కూడా చూసొద్దామంటూ థియేట‌ర్స్ కు క‌దులుతున్నారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ అయితే అ.. సినిమాకు ఫిదా అయిపోయారు. అక్క‌డ రెండు రోజుల్లోనే ఈ చిత్రం సేఫ్ జోన్ లోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే అక్క‌డ 3 కోట్ల మార్క్ అందుకుంది అ. చాలా త‌క్కువ రేట్ కు ఓవ‌ర్సీస్ హ‌క్కులు అమ్మాడు నాని. ఈ లెక్క‌న ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఓ చిన్న సినిమాకు ఈ స్థాయి వ‌సూళ్లు రావ‌డం మాత్రం నిజంగా సంచ‌ల‌న‌మే. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అ.. చిత్రం తొలి వీకెండ్ 4 కోట్ల వ‌ర‌కు వ‌చ్చింద‌ని అంచ‌నా. ఓ చిన్న సినిమాకు ఇంత స్థాయి క‌లెక్ష‌న్లు రావ‌డం మాత్రం విచిత్రం. ఈ జోరు ఇలాగే కొన‌సాగితే అ.. క‌చ్చితంగా విజ‌యం సాధించ‌డం ఖాయం. నాని ఏ న‌మ్మ‌కంతో అయితే ఈ చిత్రాన్ని నిర్మించాడో అది ఇప్పుడు ప్రేక్ష‌కులు కూడా పొందుతున్నారు. అర్థం కాని స్క్రీన్ ప్లే ఉండొచ్చు కానీ అర్థం లేని సినిమా అయితే కాదు ఈ అ..! మొత్తానికి నిజంగానే ఆశ్చ‌ర్యాన్ని కురిపిస్తూ ముందుకెళ్ళిపోతుంది అ.. సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here