అ! ఏంటో ఈ సినిమా..? 

నాని ఓ సినిమా చేస్తున్నాడంటే అంచ‌నాలు ఏ రేంజ్లో ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న నిర్మిస్తున్న సినిమాపై కూడా అంచ‌నాలు అలాగే ఉన్నాయి. నాని పూర్తిస్థాయి నిర్మాత‌గా మారి చేస్తున్న సినిమా అ!. ఈ చిత్రంలో  నిత్యా మీనన్.. శ్రీనివాస్ అవసరాల.. రెజీనా.. ఇషా రెబ్బా ఫ‌స్ట్ లుక్స్ సినిమాపై ఆస‌క్తి పెంచేసాయి. ఇంకా ప్రియదర్శి.. కాజల్ అగర్వాల్ లుక్స్ రావాలి. దానికి తోడు ర‌వితేజతో పాటు తాను కూడా వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నాడు నాని. తాజాగా విడుద‌లైన రెజీనా లుక్ గురించి ఇండ‌స్ట్రీలో చాలా చ‌ర్చే న‌డుస్తుంది. అస‌లు ఇది ఎలాంటి సినిమానో అర్థం కావ ట్లేదు ఎవ‌రికీ. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ లుక్ చూస్తుంటే సైన్స్ ఫిక్ష‌న్ అనిపిస్తుంది.. నిత్యామీన‌న్, ఇషారెబ్బా లుక్స్ చూస్తుంటే ల‌వ్ స్టోరీలా ఉంది.. ఇక ఇప్పుడు వ‌చ్చిన రెజీనా లుక్ చూస్తుంటే ఏదో మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ లా అనిపిస్తుంది.
మొత్తానికి జోన‌ర్ ఏదో తెలియ‌డం లేదు. ఇక రెజీనా లుక్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. డిసెంబ‌ర్ 13న రెజీనా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర యూనిట్ రెజీనా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్ నాని ట్విటర్‌ వేదికగా విడుద‌ల చేసాడు. అలాగే ఈ పోస్ట‌ర్ గురించి రాస్తూ.. నువ్వు దీని కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు రెజీనా. అ! చిత్ర బృందం నుంచి నీకు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేసాడు. దానికి రిప్లై ఇస్తూ ఇది నా ఉత్తమ పుట్టినరోజు బహుమతి నాని అని ట్వీటేసింది రెజీనా. మొత్తానికి ఈ లుక్కులు.. కాన్సెప్టులు చూస్తుంటే క‌చ్చితంగా నాని నిర్మిస్తున్న సినిమా మామూలు సినిమా అయితే కాదు. అది రిలీజైన త‌ర్వాత తెలుస్తుంది ఏంటా అని..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here