అ..! వివరాలు కాస్త చెప్పు నాని..!

Introducing kAWEjal Aggarwal, the Deserted Soul in అ! #Awe
నాని నిర్మాత‌గా ఏదో చేస్తున్నాడు. ఈయ‌న చేస్తోన్న సినిమాపై రోజురోజుకీ చ‌ర్చ పెరిగిపోతుంది. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఇలాంటి చిత్రం రాలేదంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. రెగ్యుల‌ర్ ప్రొడ్యూస‌ర్లు అయితే ఈ క‌థ‌ను చేయ‌రు కాబ‌ట్టే తానే నిర్మాత‌గా మారానంటున్నాడు నాని. అస‌లు అ.. సినిమాలో ఏముందో తెలియ‌క ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్న‌రాఉ. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై రాని క‌థ అంటే ఏదో కొత్త‌గా ఉంటుంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. పైగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్స్ కూడా సినిమాపై ఆస‌క్తి రెండింత‌లు చేస్తున్నాయి. ఇందులో నాని చేప‌గా.. ర‌వితేజ చెట్టుగా న‌టిస్తున్నారు. ఈ లుక్స్ కూడా ఇప్ప‌టికే విడుద‌లయ్యాయి. ఇక రెజీనా విల‌న్ గా.. శ్రీ‌నివాస్ అస‌వ‌రాల ఏదో సైంటిస్ట్ గా.. నిత్యా మీన‌న్ ల‌వ‌బుల్ పాత్ర‌లో.. ఇషారెబ్బా డిఫెరెంట్ కోణంలో.. ప్రియదర్శి ఫేక్ చెఫ్ గా న‌టిస్తున్నారు. ఇక ఇప్పుడు కాజ‌ల్ లుక్ విడుదలైంది. ఇది కూడా ఎప్ప‌ట్లాగే కొత్త‌గా అనిపిస్తుంది. 2018 ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here