ఆగస్ట్ 17న 'శీలవతి' ఆగమనం

shilavati-movie-releaseing-on-august-17th
జీ’ స్టూడియోస్ సమర్పణలో సెన్సేషనల్ స్టార్ షకీలా 250 వ చిత్రంగా, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘శీలవతి’. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చితం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఆగస్ట్ 17 న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. “ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ఇది నా 250వ చిత్రం. ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యమున్న పాత్రలో నటించాను. నెక్స్ట్ సీన్ ఏంటి అనే ఉత్కంఠ కలిగేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. ఆగస్ట్ 17న వస్తున్న ఈ ‘శీలవతి’ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను..” అని అన్నారు.
నిర్మాతలు రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. “సెన్సార్ ట్రబుల్స్ ని ఎదుర్కొని సక్సెస్ ఫుల్ గా ఆగస్ట్ 17 న ‘శీలవతి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. దర్శకుడు సాయిరామ్ దాసరి సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇది కేరళలో జరిగిన యథార్థ సంఘటన. ఈ సినిమా చూశాక.. ఇంతకు ముందు షకీలా వేరు ఈ సినిమా తరువాత షకీలా వేరు అని అందరూ అంటారు. తప్పకుండా అందరూ సినిమా చూసి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాం.. ” అన్నారు.
షకీలా, అర్జున్(జబర్దస్త్), గీతాంజలి (ఫ్రూటీ), అశోక్, కొండ, తిరుపతి, చిన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రజ్వల్ క్రిష్, డిఓపి: తరుణ్ కరామ్ తోత్, ఎడిటర్స్: శ్రీనివాస రాజలింగు, కె ఆర్. స్వామి, నిర్మాతలు: రాఘవ ఎమ్ మహేష్, వీరు బాసింశెట్టి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సాయిరామ్ దాసరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here