ఆచారి స్వామి లీల‌లు సూతము రారండి..

 
ACHARI AMERICA YATRA
స్వామిరారా.. ఇది ఎంత పెద్ద హిట్ పాట అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఇదే పాట‌ను త‌న సినిమా కోసం వాడేసుకుంటున్నాడు విష్ణు. ఈయ‌న న‌టిస్తోన్న ఆచారి అమెరికా యాత్ర‌లోని స్వామిరారా పాట విడుద‌లైంది. ఇందులో ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూ మాయ చేసింది ప్ర‌గ్య‌జైస్వాల్. టీజ‌ర్ లో గ్లామ‌ర‌స్ గా క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ‌.. పాట‌లో మాత్రం చ‌క్క‌గా తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఈ పాట ఇప్పుడు బాగానే హిట్ అవుతుంది. సినిమాపై అంచ‌నాలు ఇంకా పెంచేస్తుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచారి అమెరికా యాత్ర జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన టీజ‌ర్ చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది.. సినిమా ఎంత కామెడీగా ఉండ‌బోతుందో అని.. ఇక్క‌డే విష్ణు సెంటిమెంట్ దాగుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సీరియ‌స్ సినిమాలు చేసిన‌ప్పుడైనా విష్ణు మోస‌పోయాడేమో కానీ కామెడీని న‌మ్ముకున్న ప్ర‌తీసారి దాదాపు విజయం సాధించాడు. విష్ణు కెరీర్ లో చెప్పుకోద‌గ్గ సినిమాలుగా ఉన్న ఢీ.. దేనికైనా రెడీ.. దూసుకెళ్తా.. ఆడోర‌కం ఈడోర‌కం లాంటి సినిమాల్లో కామెడీదే పై చేయి. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ హీరో. మ‌రోసారి కంప్లీట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ తో క‌డుపులు చెక్క‌లు చేయ‌డానికి వ‌చ్చేస్తున్నాడు మంచు వార‌బ్బాయి. మ‌రి ఈయ‌న ఆశ‌లను ఆచారి ఎంత‌వ‌ర‌కు తీరుస్తాడో చూడాలిక‌..! ఇందులో చాలా రోజుల త‌ర్వాత బ్ర‌హ్మానందం ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here