ఆట వెంక‌టేశ్ ది.. వేట తేజ‌ది..

 Venky not spotted in Agnyaathavaasi


అవును.. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది. తేజ‌-వెంకటేశ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతుంది. దీనికి ఆట‌నాదే వేట‌నాదే అనే టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు. చాలా రోజులుగా వార్త‌ల్లోనే ఉన్న ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌డానికి మ‌రింత టైమ్ ప‌ట్టాలే ఉంది. దానికి కార‌ణం కూడా తేజ‌నే. ఈ చిత్రంతో ఏకంగా 60 మంది కొత్త మొహాలు క‌నిపించ‌బోతున్నాయి. ఇప్ప‌టికే హీరోయిన్ గా శ్రీ‌య‌ను ఫైన‌ల్ చేసాడు తేజ‌. ఆ మ‌ధ్య ఈ సినిమా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా మొద‌లైపోయింది. అయితే రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం మార్చ్ నుంచే. ఇందులో లెక్చ‌ర‌ర్ గా వెంకీ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. 23 ఏళ్ల కింద సుంద‌రాకాండ‌లో లెక్చ‌ర‌ర్ గా న‌టించిన వెంక‌టేశ్.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పాత్ర‌లో న‌టించ‌లేదు. ద‌ర్శ‌కేంద్రుడి త‌ర్వాత వెంకీని లెక్చ‌ర‌ర్ గా చూపిస్తున్న ద‌ర్శ‌కుడు తేజ‌నే.
ఈ పాత్ర‌పై తేజ చాలా శ్ర‌ద్ధ పెడుతున్నాడ‌ని.. ముఖ్యంగా వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని మూడు నెల‌ల్లోనే పూర్తి చేయాల్సిందిగా కండీష‌న్ పెట్టాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఓ స్టార్ హీరో సినిమా చేయాలంటే క‌నీసం 8 నెల‌లు కావాల్సిందే.. మ‌రీ సూప‌ర్ ఫాస్ట్ గా చేస్తాడంటే ఆర్నెళ్లైనా కావాల్సిందే కానీ మ‌రీ మూడు నెల‌ల్లో సినిమా పూర్తి చేయ‌డం అంటే మాట‌లు కాదు. కానీ ఇప్పుడు ఆ ఛాలెంజ్ ను తీసుకుంటున్నాడు తేజ‌. ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ లైన్ తో తెర‌కెక్కబోతుంది. అందుకే ఆట‌నాదే వేట‌నాదే అంటున్నాడు తేజ‌. వెంక‌టేశ్ సినిమాను 60 రోజుల్లోనే పూర్తి చేయాల‌నేది కండీష‌న్. వెంకీ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం బాల‌య్య‌ను లైన్ లో పెట్టాడు తేజ‌. ఇది ఆగ‌స్ట్ లో ప‌ట్టాలెక్క‌నుంది. అంటే ఆ లోపు వెంకీ సినిమా పూర్తి చేయాలి. కానీ ఆ లోపే కొత్త న‌టుల వేట పూర్తిచేయాలి తేజ‌. మొత్తానికి చూడాలిక‌.. నేనేరాజు నేనేమంత్రి త‌ర‌హాలోనే ఆట‌నాదే వేట‌నాదే అంటున్నాడు తేజ‌. మ‌రి చూడాలిక‌.. అబ్బాయితో హిట్ కొట్టిన తేజ‌.. బాబాయ్ తోనూ ఇదే సీన్ రిపీట్ చేస్తాడేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here