ఆఫీస‌ర్ అవుతానంటున్న నాగార్జున‌..

అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే ఈ పాటికి నాగార్జున సినిమా పేరుతో పాటు ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చేసేది. కానీ ఏం చేస్తాం బ్యాడ్ ల‌క్.. శ్రీ‌దేవి మ‌ర‌ణం వ‌ర్మ‌ను బాగా డిస్ట‌ర్బ్ చేసింది. అందుకే షూటింగ్ కూడా ఆపేసి ఇంట్లోనే ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే ఫిబ్ర‌వ‌రి 25 మ‌ధ్యాహ్నం రావాల్సిన నాగ్ సినిమా ఫ‌స్ట్ లుక్ ఇంకా రాలేదు. షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చాడు వ‌ర్మ‌. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలోనే జ‌రుగుతుంది. 24 ఏళ్ళ త‌ర్వాత మ‌రోసారి వ‌ర్మ‌ను న‌మ్మాడు ఈ హీరో. ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాడ‌నే ఆశ‌తో ఉన్నాడు నాగ్. ఈ సినిమా కూడా పోలీస్ బ్యాక్ డ్రాప్ కావ‌డం విశేషం. మార్చ్ 30 లోపు త‌న సినిమా పూర్తి చేయాల‌నేది వ‌ర్మ‌కు నాగార్జున పెట్టిన కండీష‌న్. ఇది పూర్తి చేస్తానంటూ స్నేహితుడికి మాట కూడా ఇచ్చాడు వ‌ర్మ‌.
ఈ చిత్రానికి టైటిల్ ఏంట‌నే విష‌యంపై ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు అభిమానుల్లో కూడా చ‌ర్చ‌లు బాగానే న‌డుస్తున్నాయి. దీనికి ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగు టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. గ‌న్ అంటూ ప‌ర్ ఫెక్ట్ మ‌సాలా టైటిల్ ఒక‌టి సిద్ధంగా ఉంటే.. సిస్ట‌మ్ అంటూ వ‌ర్మ స్టైల్ లో మ‌రో టైటిల్ కూడా ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ఇక మూడోది శ‌ప‌థం. ఇక ఇప్పుడు కొత్త‌గా ఆఫీస‌ర్ అని బ‌య‌టికి వ‌చ్చింది. ఇదే క‌న్ఫ‌ర్మ్ కావ‌చ్చ‌నేది ప్ర‌స్తుతం వినిపిస్తున్న వార్త‌. ఇది పూర్తిగా వ‌ర్మ స్టైల్ లో ఉండే టైటిల్. క‌థ‌కు త‌గ్గ టైటిల్ కూడా ఇదే అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున న‌ట విశ్వ‌రూపం చూస్తారంటున్నాడు వ‌ర్మ‌. త‌న ఆఫీస‌ర్ స‌మాజంలో ఉన్న చెడును నిర్మూలించ‌డానికి వ‌స్తున్నాడంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి చూడాలిక‌.. ఈ సినిమాతో నాగార్జున‌ను వ‌ర్మ ఏం చేస్తాడో..? ఏం చేయ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here