ఆ తెలుగు హీరోతో అట్లీకుమార్.. 

అట్లీకుమార్.. త‌మిళ ఇండ‌స్ట్రీలో ఈ పేరు ఇప్పుడు ఓ సంచ‌ల‌నం. చేసింది మూడు సినిమాలే కానీ మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లే. ఒక‌టేమో ల‌వ్ స్టోరీ.. మ‌రొక‌టి యాక్ష‌న్.. ఇంకొక‌టి మెడికల్ మాఫియా.. ఇలా ఒక్కో జోన‌ర్ లో ఒక్కో సినిమా చేసి ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీని ఊపేస్తున్నాడు అట్లీకుమార్. మెర్స‌ల్ సినిమాతో ఈ మ‌ధ్యే హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ఈ చిత్రం ఏకంగా 250 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది. దాంతో అట్లీకుమార్ పేరు మారుమోగిపోతుంది. ఉన్న‌ఫ‌లంగా తెలుగు ఇండ‌స్ట్రీకి అట్లీని ఎత్తుకొచ్చేయాల‌ని తెలుగులో కొంద‌రు హీరోలు, నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ కుర్ర ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డానికి మ‌న హీరోలు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు. సోష‌ల్ ఇష్యూ ల‌ను క‌మ‌ర్షియ‌ల్ గా చెప్ప‌డంలో అట్లీ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు. దాంతో అట్లీ టేకింగ్ కు ఫిదా అయిన మ‌న హీరోలు.. తెలుగులోకి మ‌నోడిని తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయ‌డానికి అట్లీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే మ‌రో వైపు అట్లీ త‌మిళ‌నాట ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఈయ‌న త‌ర్వాతి సినిమా కూడా విజ‌య్ తోనే ఉండ‌బోతుంది. దాంతోపాటే ఎన్టీఆర్ సినిమాపై కూడా అట్లీ దృష్టి పెడ‌తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. అట్లీకుమార్ తెలుగులో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here