ఆ సూప‌ర్ స్టార్ తో అదితి.. అదిరింది..!

ADITHI RAO MAHESH BABU

కొంద‌రికి బ్రేక్ రావ‌డం ఆల‌స్యం అవుతుంది కానీ ఒక్క‌సారి వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల‌ను ఆప‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. ఇప్పుడు అదితిరావ్ హైద్రీ విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ప‌దేళ్ల కిందే బాలీవుడ్ కు వ‌చ్చింది అదితి. అక్క‌డ దాదాపు డ‌జ‌న్ సినిమాలు చేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు మాత్రం రాలేదు. చిన్నా చిత‌కా సినిమాల్లో హీరోయిన్.. పెద్ద సినిమాల్లో అయితే స‌పోర్టింగ్ కారెక్ట‌ర్సే ఇచ్చారు.

కానీ ద‌క్షిణాదిన మాత్రం అదితి జాత‌కం మారిపోయేలా ఉంది. త‌మిళ్ లో చెలియా ఫ్లాపైనా బాగానే గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తోన్న న‌వాబ్ లోనూ న‌టిస్తుంది అదితి. ఇక తెలుగులో తొలి సినిమాతోనే అలా పేరు తెచ్చుకుంది మ‌రి. స‌మ్మోహ‌నంగా ఆక‌ర్షిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయే అన్ని ల‌క్ష‌ణాలు త‌న‌లో ఉన్నాయ‌ని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్నాళ్లూ ఈ పేరుకు తెలుగులో త‌క్కువ గుర్తింపు ఉంది కానీ త్వ‌ర‌లోనే ఈ భామ ఇమేజ్ అలా పెరిగిపోయే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది.

హైద్రాబాద్ నుంచే ముంబైకి వెళ్లింది అదితిరావ్ హ‌ద్రీ. అక్క‌డే సెటిల్ కావ‌డంతో సొంత ఇండ‌స్ట్రీని అస్స‌లు ప‌ట్టించుకోలేదు అదితి. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ పిలిచి అవ‌కాశాలు ఇస్తుండ‌టంతో బాలీవుడ్ ను కాద‌ని ఇక్క‌డికి వ‌స్తుంది ఈ భామ‌. స‌మ్మోహనంలో సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది అదితి. పైగా ఇప్పుడు సినిమాలో ఈమె వాయిస్ కు కూడా మంచి మార్కులే ప‌డ‌టంతో అదితిపై క‌న్నేసి ఉంచుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లంతా.

ఇక ఇప్పుడు మ‌హేశ్ 25వ సినిమాలో అదితి రావ్ ను రెండో హీరోయిన్ గా తీసుకుంటున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి మ‌హేశ్ కూడా ఓకే చెప్పాడ‌ని తెలుస్తుంది. కేవ‌లం న‌ట‌నే కాదు.. అందాల ఆర‌బోత‌లో కూడా అమ్మాయిగారికి అస్స‌లు అడ్డంకులు లేవు. ప్ర‌స్తుతం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ కు జోడీగా న‌టిస్తుంది అదితి. ఇక ఇప్పుడు మ‌హేశ్ సినిమా కూడా వ‌ర్క‌వుట్ అయితే అదితి జాత‌కం మారిపోయిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here