ఆ స్టార్ హీరో ఛ‌లో లండ‌న్..!


ఈ మ‌ధ్య కాలంలో మ‌న హీరోలంద‌రి క‌న్ను లండ‌న్ పై ప‌డింది. తొలిప్రేమ షూటింగ్ అంతా అక్క‌డే జరిగింది. ఆ మ‌ధ్య నాన్న‌కు ప్రేమతో కూడా అంతే. ఇక తెలుగుతో పాటు త‌మిళ హీరోలు కూడా ఛ‌లో లండ‌న్ అంటున్నారిప్పుడు. తాజాగా సూర్య న‌టించ‌బోయే సినిమా కూడా లండ‌న్ నేప‌థ్యంలోనే తెర‌కెక్క‌నుంది. కేవీ ఆనంద్ దీనికి ద‌ర్శ‌కుడు. ఇద‌వ‌ర‌కే సూర్య‌తో వీడొక్క‌డే.. బ్ర‌ద‌ర్స్ సినిమాలు చేసాడు ఆనంద్.
ఇందులో బ్ర‌ద‌ర్స్ ఫ్లాప్ అయినా.. వీడొక్క‌డే(త‌మిళ్ లో అయాన్) మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్. ఇక ఇప్పుడు మ‌రోసారి డిఫెరెంట్ క‌థ‌తో సూర్య ద‌గ్గ‌రికి వ‌చ్చాడు ఆనంద్. ఈ చిత్రంలో సూర్య‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోలు న‌టించ‌బోతున్నారు. మ‌ళ‌యాలం నుంచి మోహ‌న్ లాల్.. తెలుగు నుంచి అల్లు శిరీష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు.
జూన్ చివ‌రి వారంలో ఈ చిత్రం లండ‌న్ లో ప‌ట్టాలెక్క‌నుంది. ఎక్కువ భాగం షూటింగ్ కూడా అక్క‌డే ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు ఆనంద్. ప్ర‌స్తుతం సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్ జి కే సినిమాలో న‌టిస్తున్నాడు సూర్య‌. దీని త‌ర్వాత కేవీ ఆనంద్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపుల‌తో సూర్య కెరీర్ ప్ర‌స్తుతం ఎటూ కాకుండా ఉంది. మ‌రి ఈ స‌మ‌యంలో సూర్యను కేవీ ఆనంద్ అయినా బ‌య‌ట‌ప‌డేస్తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here