ఆ హీరోకు ప‌డిపోయిన సాయిప‌ల్ల‌వి.. 

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఏ హీరోయిన్ అయినా ముందుగా అనుకునేది స్టార్ హీరోల‌తో న‌టించాల‌ని.. వాళ్ళ‌తో న‌టిస్తే త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్  అవ్వొచ్చు. ఇండ‌స్ట్రీలో స్టార్ అయిపోవ‌డానికి అదో ఈజీ రూట్. కానీ త‌న‌కు ఈ షార్ట్ క‌ట్స్ తో ప‌నిలేదు అంటుంది సాయిప‌ల్ల‌వి. ఈ భామ త‌న‌కు తానుగా స్టార్ అనిపించుకోవాల‌ని చూస్తుంది. అంటే చిన్న హీరోల‌తో న‌టించి.. మంచి పాత్ర‌లు ఉండే సినిమాల్లో క‌నిపించి స్టార్ అవ్వాల‌నుకుంటుంద‌న్న‌మాట‌. ఇప్ప‌టి వ‌ర‌కు అదే చేసింది.. ఇక‌పై కూడా అదే చేస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే స్టార్ హీరోల‌తో న‌టించే ఛాన్స్ వ‌చ్చినా కూడా వ‌ద్దంటుందే కానీ అందిపుచ్చుకోవ‌ట్లేదు. ఇప్ప‌టికే కార్తి, అజిత్, విక్ర‌మ్ లాంటి హీరోల‌కు నో చెప్పిన చ‌రిత్ర ఇప్ప‌టికే సాయిప‌ల్ల‌వి సొంతం.
తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ఈ భామ‌కు తెలుగు ప్రేక్ష‌కులంతా ఫిదా అయిపోయారు. ఫిదాతో తెలుగులో ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింది ఈ భామ‌. రెండేళ్ల కింద మ‌ళ‌యాలంలోనూ తొలి సినిమాతోనే స్టార్ అయిపోయింది. అక్క‌డ ప్రేమ‌మ్ లో మ‌ల‌ర్ గా ఎలా మాయ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో భాన్సువాడ భానుమ‌తిగా ఫిక్స్ అయిపోయింది సాయిప‌ల్ల‌వి. ఇప్పుడు నానితో ఎంసిఏ సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్త‌యింది. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం విడుద‌ల కానుంది. దాంతోపాటు క‌ణం సినిమాలోనూ న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. ఇందులో నాగశౌర్య హీరో అయినా.. అంద‌రి చూపు  మాత్రం సాయిప‌ల్ల‌విపైనే ఉంది.
ఇన్ని సినిమాల్లో చిన్న హీరోల‌తోనే న‌టించిన సాయిప‌ల్ల‌వి.. తొలిసారి ఓ స్టార్ హీరోతో రొమాన్స్ చేయ‌డానికి రెడీ అవుతుంద‌ని తెలుస్తుంది. ఆయ‌నే సూర్య‌. అవును.. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సాయిప‌ల్ల‌వికి సూర్య అంటే పిచ్చి. కాలేజ్ డేస్ నుంచి కూడా సూర్య సినిమాలు చూసేదాన్న‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి. చాలా ఇంట‌ర్వ్యూల్లో త‌న‌కు సూర్య‌పై ఎంత అభిమానం వుందో చెప్పింది. త‌న‌కు కానీ ఆయ‌న‌తో న‌టించే అవ‌కాశం వ‌స్తే అస‌లు వ‌దులుకోన‌ని చెప్పిన సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు సెల్వ రాఘ‌వ‌న్ సినిమాల్లో న‌టించే ఛాన్స్ కొట్టేసింద‌ని తెలుస్తుంది. అడిగిన వెంట‌నే నో చెప్ప కుండా అభిమాన హీరోతో న‌టించే అవ‌కాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి సాయిప‌ల్ల‌వి అంద‌ర్నీ ఫిదా చేస్తుంటే.. ఆమెనే ఫిదా చేసిన హీరో కూడా ఒక‌రున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here