ఇంటిదైపోయిన ఇలియానా..

 


ఒక‌ప్పుడు సినిమా వాళ్ల ప్రేమలంటే నీటి మీద రాత‌లు అనుకునేవాళ్లు. ఎప్పుడు క‌లిసుంటారో.. ఎప్పుడు విడిపోతారో తెలియ‌దు. అస‌లు పెళ్లి వ‌ర‌కు వెళ్లే ప్ర‌యాణాలే చాలా అరుదు. కానీ ఇప్పుడు వాళ్లు మారిపోయారు. ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటాం అనే న‌మ్మ‌కం క‌లిగిస్తున్నారు. రెండేళ్ళ త‌మ ప్రేమ‌ను పెళ్లితో ఒక్క‌టి చేసుకున్నారు ఆ మ‌ధ్య స‌మంత‌-నాగ‌చైత‌న్య‌. ఇక ఈ మ‌ధ్యే అనుష్క‌శ‌ర్మ‌ను పెళ్లాడాడు విరాట్ కోహ్లీ. జ‌హీర్ ఖాన్ కూడా త‌న ప్రేమ‌ను గెలిపిం చుకున్నాడు. ఇక ఇప్పుడు మ‌రో ముద్దుగుమ్మ ఇలాగే పెళ్లి కూతురైంది. ఆమె ఇలియానా. అవును.. ఎవ‌రికి చెప్ప‌కుండానే ఇల్లీబేబీ పెళ్లి కూతురైంది. ఈ భామ త‌న లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూ నికోన్ ను పెళ్లి చేసుకుంది. అఫీషియ‌ల్ గా ఎక్క‌డా చెప్ప‌క‌పోయినా.. త‌న ఇన్ స్టాగ్రామ్ లో ఇట్స్ మై హ‌బ్బీస్ ఫోటో అంటూ ఆండ్ర్యూ తీసిన ఫోటోను పోస్ట్ చేసింది. అంటే పెళ్లైంద‌న్న‌మాటే క‌దా..! మొత్తానికి మూడేళ్ల ప్రేమ బంధాన్ని ఏడడుగుల‌తో ఒక్క‌టి చేసింది ఈ గోవాబ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here