ఇంటిలిజెంట్.. రొటీన్ గానే ఉన్నాడుగా..!

Inttelligent trailer
టైటిల్ మాత్రం ఇంటిలిజెంట్.. కానీ ఉన్న‌ది మాత్రం రొటీన్. వినాయ‌క్ పెద్ద‌గా మార‌లేదు. ఎప్ప‌ట్లాగే మ‌రోసారి ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైనర్ తోనే వ‌స్తున్నాడు. సాయిధ‌రంతేజ్ తో ప‌క్కా మాస్ మ‌సాలా సినిమాను దించేస్తున్నాడు వినాయ‌క్. ఇంటిలిజెంట్ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా అర్థ‌మ‌య్యేది ఇదే. కామెడీ.. డాన్సులు.. యాక్ష‌న్.. మాస్ అంశాలు.. ఫ్యామిలీ ఎమోష‌న్స్.. ఇలా అన్నీ స‌మ‌పాళ్ల‌లో నింపి ఓ వంట‌కం సిద్ధం చేసాడు వినాయ‌క్. ఆకుల శివ దానికి కావాల్సిన మ‌సాలా ఇచ్చేసాడు. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది ఇంటిలిజెంట్. వ‌ర‌స‌గా నాలుగు ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న సాయికి ఈ చిత్రం క‌చ్చితంగా హిట్ అవ్వాల్సిందే. ఇంటిలిజెంట్ లో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా క‌నిపిస్తున్నాడు సాయిధ‌రంతేజ్. త‌న ఫ్యామిలీకి జ‌రిగిన అన్యాయాన్ని ఎదుర్కొని.. ప‌గ తీర్చుకునే కుర్రాడిగా న‌టిస్తున్నాడు సుప్రీమ్ హీరో. ట్రైల‌ర్ చూస్తుంటే నాయ‌క్ సీక్వెల్ గా అనిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. సాయితో క‌లిసి వినాయ‌క్ ఏం మాయ చేసుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here