ఇంత‌కీ ఏం చేస్తున్నావ్ విజ‌య్..?

సినిమాలు ఉంటే ఓ కంగారు.. లేక‌పోతే మ‌రో కంగారు..! ఇప్పుడు తొలి రకంలో టెన్ష‌న్ ప‌డుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న చేతినిండా సినిమాలు ఉన్నాయిప్పుడు. అందులో మూడు సినిమాలు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయి. దాంతో ఏది ముందు.. ఏది త‌ర్వాత అనే టెన్ష‌న్ లో ప‌డిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ట్యాక్సీవాలా షూటింగ్ పూర్తి చేసుకుని నెల రోజులు గ‌డిచినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాలేదు.

ఎప్పుడు విడుద‌ల‌వుతుందో క్లారిటీ కూడా లేదు. ఇక మ‌రోవైపు గీతాఆర్ట్స్ లోనే న‌టిస్తున్న గీత‌గోవిందం కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా ఎప్పుడు విడుద‌ల కానుందో తెలియ‌దు. అవ‌స‌రం అనుకుంటే ట్యాక్సీవాలాని వెన‌క్కి పంపించి.. గీతాగోవిందాన్ని ముందు విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు అల్లు అర‌వింద్.

కొత్త ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రీత్య‌న్ ట్యాక్సీవాలాను తెర‌కెక్కిస్తే.. ప‌రుశురామ్ గీత‌గోవిందం సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ రెండు సినిమాల‌తో పాటు తెలుగు, త‌మిళ్ లో ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న నోటా సినిమా షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్ర చివ‌రి షెడ్యూల్ చెన్నైలో జ‌రుగుతుంది. దాంతో ఈ మూడు సినిమాల్లో ఏది ముందు వ‌స్తుందో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నాడు విజ‌య్ దేవ‌రకొండ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here