ఇదం జ‌గత్ అంటున్న అక్కినేని అల్లుడు..

ఒక్క సినిమా చాలు.. మ‌రిచిపోయిన హీరోను మ‌ళ్లీ గుర్తు చేయ‌డానికి..! గ‌తేడాది సుమంత్ విష‌యంలో ఇదే జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ మ‌రిచిపోయిన సుమంత్ ను మ‌ళ్లీరావా మ‌ళ్లీ గుర్తు చేసింది. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధించ‌లేదు కానీ సుమంత్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే విష‌యం మాత్రం గుర్తు చేసింది.

గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు నానితో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మ‌ళ్లీ రావా ఇచ్చిన స్పూర్థితో ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు సుమంత్. ఈ చిత్రానికి ఇదం జ‌గ‌త్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇందులో సుమంత్ కాస్త నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. కొత్త ద‌ర్శ‌కుడు అనిల్ శ్రీ‌కంఠం తెర‌కెక్కిస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. సినిమాను జులై చివ‌ర్లో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ విగ్నేష్ కార్తిక్ సినిమాస్ పతాకంపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మ‌రి ఈ చిత్రంతో సుమంత్ మ‌ళ్లీ త‌న కెరీర్ ను గాడిన పెట్టుకుంటాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here