ఇప్పుడు రాజ్ త‌రుణ్ ప‌రిస్థితేంటి..?


దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌రుణించ‌న‌ట్లుంది ఇప్పుడు రాజ్ త‌రుణ్. ఎందుకంటే వ‌ర‌స డిజాస్ట‌ర్స్ తో ఈయ‌న కెరీర్ ముందుకెళ్ల‌డం కూడా క‌ష్టం అయిపోయింది ఇప్పుడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన రాజుగాడు.. రంగుల‌రాట్నం పూర్తిగా ఈయ‌న కెరీర్ డౌన్ ఫాల్ లోకి తీసుకెళ్లాయి. అయితే ఎన్ని ఫ్లాప్స్ వ‌చ్చినా కూడా ల‌వ‌ర్ త‌న‌కు ఉన్నాడ‌ని ధైర్యంగా ఉన్నాడు ఈ హీరో. పైగా దిల్ రాజు బ్యాన‌ర్ కావ‌డంతో ఎలాంటి అనుమానాలు లేకుండా ఉన్నాడు ఈ కుర్ర హీరో. అయితే ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత ఈ చిత్రానికి కూడా నెగిటివ్ టాక్ రావ‌డంతో రాజ్ త‌రుణ్ షాక్ లోనే ఉన్నాడు. అస‌లు ఏం చేస్తే త‌న కెరీర్ గాడిన ప‌డుతుందో ఇప్పుడు ఈయ‌న‌కు కూడా క్లారిటీ రావ‌ట్లేదు.
వ‌ర‌స విజ‌యాల‌తో జోరు మీదున్న రాజుగారి జోరుకు బ్రేకులేసేసాడు రాజ్ త‌రుణ్. ల‌వ‌ర్ కు క‌నీస ఓపెనింగ్స్ కూడా రాక‌పోవ‌డంతో దిల్ రాజు కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్నాడ‌ని తెలుస్తుంది. ఇక‌పై త‌న బ్యాన‌ర్ నుంచి వ‌చ్చే సినిమాల క‌థ‌ల విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నాడు. ముఖ్యంగా త‌ను కొన్నాళ్లు ఇంక చిన్న సినిమాలు చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్న‌ట్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు దిల్ రాజు. ల‌వ‌ర్ పోయినా రాజుగారికి పోయేదేం లేదు కానీ రాజ్ త‌రుణ్ కు మాత్రం కెరీర్ పోతుంది. మ‌రి చూడాలిక‌.. ఇప్పుడు ఈ కుర్ర హీరో ఏం చేస్తాడో..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here