ఈ న‌గ‌రానికి ఏమైంది.. ఫుల్ కామెడీ..!

ప్ర‌మోష‌న్ కోసం జుట్టు పీక్కుంటుంటారు కొంద‌రు ద‌ర్శ‌కులు. కానీ సినిమాను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో తెలిసిన వాడికి మాత్రం అది అస‌లు లెక్కే కాదు. ఇప్పుడు త‌రుణ్ భాస్క‌ర్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయ‌న‌కు త‌క్కువ బ‌డ్జెట్ తో సినిమాలు చేయ‌డమే కాదు.. దాన్ని ఇంతా త‌క్క‌వ బ‌డ్జెట్ తో ప్ర‌మోట్ చేసుకోవ‌డం ఎలాగో కూడా తెలుసు. కావాలంటే ఇప్పుడు ఈ న‌గ‌రానికి ఏమైంది ప్రీ రిలీజ్ వేడుక‌నే చూడండి.

దీన్ని ఏ శిల్ప‌క‌ళావేదిక లో చేసి.. స్టార్స్ ను అంద‌ర్నీ పిలిచి ర‌చ్చ చేసే కంటే సింపుల్ గా కేటీఆర్ ను పిలిచారు.. దానికితోడు సినిమా యూనిట్ అంతా స్టేజ్ పై ర‌చ్చ ర‌చ్చ చేసారు. వాళ్ల కామెడీతోనే సినిమాపై కావాల్సినంత పాజిటివ్ వైబ్రేష‌న్స్ వ‌చ్చేసాయి. ముఖ్యంగా కేటీఆర్ కూడా ఇలాంటి సినిమాలు ఇంకా రావాల‌ని..

నువ్వు కూడా స్టార్స్ మాయ‌లో ప‌డిపోకుండా ఎప్పుడూ ఇలాంటి చిన్న సినిమాలే చేస్తావ‌ని అనుకుంటున్నానంటూ త‌రుణ్ ను ఉద్ధేశించి చెప్పాడు కేటీఆర్. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే హ్యాంగోవ‌ర్.. జింద‌గీ నా మిలేగి దొబారా త‌ర‌హాలో సాగే కామెడీ థ్రిల్ల‌ర్ అనిపిస్తుంద‌ని.. క‌చ్చితంగా ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని చెప్పాడు కేటీఆర్. మొత్తానికి వీళ్లు చేస్తోన్న ర‌చ్చ‌కే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. జూన్ 29న సినిమా విడుద‌ల కానుంది. పెళ్లిచూపులు 14 కోట్ల ద‌గ్గ‌ర ఆగితే.. ఈ చిత్రం 20 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here