ఈ ప్ర‌యోగం ఏంటి వ‌ర్మ గారు..? 

NagRGV4 Title
వ‌ర్మ అంటేనే క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో ప్ర‌యోగాలు చేసే ద‌ర్శ‌కుడు అని అర్థం. ప్రేక్ష‌కులతో ఆయ‌న‌కు ప‌నిలేదు. త‌న‌కు న‌చ్చింది తీస్తాడు.. న‌చ్చితే చూడండి అంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న నాగార్జున‌తో ఆఫీస‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలోనే జ‌రుగుతుంది. 24 ఏళ్ళ త‌ర్వాత మ‌రోసారి వ‌ర్మ‌ను న‌మ్మాడు ఈ హీరో. ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాడ‌నే ఆశ‌తో ఉన్నాడు నాగ్. ఈ సినిమా కూడా పోలీస్ బ్యాక్ డ్రాప్ కావ‌డం విశేషం. మార్చ్ 30 లోపు త‌న సినిమా పూర్తి చేయాల‌నేది వ‌ర్మ‌కు నాగార్జున పెట్టిన కండీష‌న్. ఇది పూర్తి చేస్తానంటూ స్నేహితుడికి మాట కూడా ఇచ్చాడు వ‌ర్మ‌. ఈ సినిమాలో నాగార్జున న‌ట విశ్వ‌రూపం చూస్తారంటున్నాడు వ‌ర్మ‌. త‌న ఆఫీస‌ర్ స‌మాజంలో ఉన్న చెడును నిర్మూలించ‌డానికి వ‌స్తున్నాడంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో హీరోయిన్ ఉంటుంది కానీ రొమాన్స్ ఉండ‌దు.. పాట‌లుండ‌వు.. కామెడీకి చోటే ఉండ‌దు.. అంతా సీరియ‌స్సే. అంతేకాదు.. ఈ సినిమా నిడివి కూడా కేవ‌లం గంటా 45 నిమిషాలే. గ‌తంలో విష్ణుతో వ‌ర్మ తెర‌కెక్కించిన అనుక్ష‌ణం సినిమా కూడా గంట‌న్న‌రే. దానికి ఇంట‌ర్వెల్ కూడా ఉండ‌దు. ఇప్పుడు నాగార్జున‌తో కూడా హాలీవుడ్ స్టైల్ లో ప‌క్కా యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడు వ‌ర్మ‌. మ‌రి చూడాలిక‌.. ఈ సినిమాతో నాగార్జున‌ను వ‌ర్మ ఏం చేస్తాడో..? ఏం చేయ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here