ఎంసిఏ.. గ‌ట్టిగా కొట్టేలా ఉందిగా..

MCA Trailer

నాని మ‌రోసారి మాయ చేస్తున్నాడు. ఈయ‌న న‌టించిన ఎంసిఏ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత నాని ఖాతాలో వ‌ర‌స‌గా ఎనిమిదో హిట్ చేరే స‌మ‌యం వ‌చ్చిన‌ట్లు అర్థ‌మైపోతుంది. మ‌రోసారి త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్ తో ప‌డగొడుతున్నాడు నాని. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కేక పెట్టిస్తున్నాడు నాని. ట్రైల‌ర్ మొత్తం నాని త‌ప్ప మ‌రొక‌రు క‌నిపించ‌లేదు. సాయిప‌ల్ల‌విని కూడా క‌నిపించ‌కుండా చేసాడు నాని. ఈ భామ కూడా నాని ముందు రెగ్యుల‌ర్ హీరోయిన్ అయిపోయింది. దిల్ రాజు నిర్మాత‌. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అంచ‌నాలు మ‌రింత‌గా పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఓ మై ఫ్రెండ్ తో నిరాశ ప‌రిచిన వేణు శ్రీ‌రామ్ ఎంసిఏతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకునేలాగే క‌నిపిస్తున్నాడు. డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఆ లోపు ప్ర‌మోష‌న్ ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.
పైగా ఎంసిఏ ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంది. అస‌లు ఈ బిజినెస్ చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అయిపోతున్నారు. ర‌వితేజ సినిమాల‌కు కూడా ఈ రేంజ్ బిజినెస్ జ‌ర‌గ‌డం లేదిప్పుడు. కానీ నానికి జ‌రిగిపోతుంది. థియెట్రిక‌ల్  బిజినెస్ రూపంలోనే దిల్ రాజుకు 25 కోట్లు వ‌చ్చేస్తున్నాయి. ఇక డిజిటల్ రైట్స్ ను అమేజాన్ 5.50 కోట్ల‌కు ఎగ‌రేసుకుపోయింది. శాటిలైట్ ఎంత లేద‌న్నా 6 కోట్ల‌కు పైగానే రానుంది. మిగిలిన రైట్స్ అన్నీ క‌లిపితే మ‌రో 10 కోట్ల వ‌ర‌కు రానున్నాయి. అంతా కొడితే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించింది 20 కోట్ల‌లోపే. అంటే విడుద‌ల‌కు ముందే నిర్మాత‌కు 20 కోట్ల లాభం అన్న‌మాట‌. ఇప్పుడు చెప్పండి.. నాని సినిమా అంటే స్టార్స్ కు షాకా కాదా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here