ఎంసిఏ 30 కోట్లు ట‌చ్ చేస్తుందా..?

MCA
తొలిరోజు వ‌చ్చిన టాక్ కు ఇప్పుడు వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌కు ఎక్క‌డా పొంత‌న లేదు. అస‌లు ఎంసిఏ సినిమాకు ఈ స్థాయిలో వ‌సూళ్లు వ‌స్తాయ‌ని టీం కూడా ఊహించి ఉండ‌దు. తొలి రోజు టాక్ తెలిసిన త‌ర్వాత మహా అయితే యావ‌రేజ్ వ‌సూళ్లు అందుకుంటుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే మ‌రోలా క‌నిపిస్తున్నాయి. కేవ‌లం 5 రోజుల్లోనే ఈ చిత్రం 25 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి.. 30 కోట్ల వైపు ప‌రుగులు తీస్తుంది. అస‌లు నానికి ఇంత మార్కెట్ ఉంద‌నే విష‌యం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దు. నేనులోక‌ల్ 35 కోట్ల మార్క్ అందుకున్నా.. అప్పుడు అన్నీ క‌లిసొచ్చాయి. పైగా సినిమా కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు హ‌లో లాంటి పోటీ ఉంచుకుని నాని ఈ రేంజ్ లో కుమ్మేస్తున్నాడు. అదే కానీ ఎంసిఏ సోలోగా వ‌చ్చుంటే ఈ పాటికి వ‌సూళ్లు మ‌రింత పెరిగేవేమో..? జ‌స్ట్ యావ‌రేజ్ టాక్ తోనే నాని సినిమాకు ఈ స్థాయి వ‌సూళ్లు వ‌స్తున్నాయంటే మ‌నోడి రేంజ్ బాగా పెరిగిపోయిన‌ట్లే. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లోనూ  8 లక్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసాడు మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇక ఇండియాలోనూ ఈ చిత్ర దూకుడు ఇలాగే ఉంది. హ‌లో పోటీలో తేలిపోవ‌డం ఎంసిఏకు బాగా క‌లిసొచ్చింది. వ‌చ్చే వారం కూడా ఒక్క‌క్ష‌ణం త‌ప్ప మ‌రే సినిమా లేదు. సునీల్ 2 కంట్రీస్ ఉన్నా మ‌నోడు ఇప్పుడు అస‌లు ఫామ్ లో లేడు. దాంతో మ‌రో వారం కూడా మిడిల్ క్లాస్ అబ్బాయికి క‌లిసి రానుంది. మ‌రి చివ‌రివ‌ర‌కు ఈ ప్ర‌యాణం ఎలా ఉంటుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here