ఎన్టీఆర్.. మ‌రోసారి నాన్న‌కు ప్రేమ‌తో.. 

NTR
నాన్న‌కు ప్రేమ‌తో మ‌రోసారి అంటే ఈ సినిమానే మ‌ళ్లీ చేస్తున్నాడా ఏంటి అనుకోవ‌ద్దు. నాన్న‌కు ప్రేమ‌తో అంటూ ఇప్ప‌టికే సినిమాలో అనేసాడు యంగ్ టైగ‌ర్. రియ‌ల్ లైఫ్ లో కూడా నాన్న అనిపించుకున్నాడు. నాలుగేళ్ల కిందే అభ‌య్ రామ్ కు జ‌న్మ‌నిచ్చింది ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీప్ర‌ణ‌తి. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈమె త‌ల్లి కాబోతుంద‌నే వార్త‌లు నంద‌మూరి అభిమానుల‌ను ఆనందంలో ముంచేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వార్త‌ను సీక్రేట్ గానే ఉంచారు. కానీ ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా జూనియ‌ర్ ఇంటికి బంధువుల తాకిడి పెర‌గ‌డంతో విష‌యం ఏంటా అని ఆరా తీస్తే.. ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి కాబోతున్నాడ‌నే విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని దాచేయాల‌ని చూడ‌లేదు కానీ స‌మ‌యం వ‌చ్చిన‌పుడే తానే స్వ‌యంగా ప్ర‌క‌టించాల‌ని ఆగాడు ఎన్టీఆర్. కానీ అది అనుకోకుండా బ‌య‌టికి వ‌చ్చేసింది. 2011లో ల‌క్ష్మీప్ర‌ణ‌తిని ప‌రిణ‌యం ఆడాడు ఎన్టీఆర్. ఈమె ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బంధువు కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ల‌క్ష్మీప్ర‌ణ‌తి ఆర్నెళ్ల గ‌ర్భ‌వ‌తి అని తెలుస్తుంది. మే నెల‌లోనే నంద‌మూరి ఇంటికి మ‌రో కొత్త రూపం రానుంది. అది వార‌సుడా.. వార‌సురాలా అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమాతో పాటు రాజ‌మౌళి సినిమాకు కూడా క‌మిట‌య్యాడు. వీటితో బిజీగా ఉంటూనే ఇంట్లో భార్య‌ను కూడా చూసుకుంటున్నాడు జూనియ‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here