ఎన్టీఆర్ మ‌ళ్లీ వ‌స్తున్నాడంట‌..


ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సూప‌ర్ ఫాస్ట్ గా జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ చూడ‌ని త్రివిక్ర‌మ్ ను ఇప్పుడు అభిమానులు చూస్తున్నారు. త‌న‌లో ఉన్న ఇంకో మ‌నిషికి ఇప్పుడు ప‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. లేక‌పోతే మ‌రేంటి.. రెండేళ్ల‌కో సినిమా చేసే త్రివిక్ర‌మ్ ఇప్పుడు ఎన్టీఆర్ అరవింద స‌మేత‌ను మాత్రం ఊహించ‌ని వేగంతో పూర్తి చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు.
చిన్న బ్రేక్ ఇచ్చిన మాట‌ల మాంత్రి కుడు ఇప్పుడు మ‌ళ్లీ కొత్త షెడ్యూల్ తో వ‌స్తున్నాడు. అక్టోబ‌ర్ లో రాజ‌మౌళి సినిమాకు ఎన్టీఆర్ వెళ్లాలి కాబ‌ట్టి డెడ్ లైన్ పెట్టుకుని మ‌రీ ప‌ని చేస్తున్నాడు.
ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు రెస్పాన్స్ బాగానే వ‌చ్చింది. ముఖ్యంగా థ‌మ‌న్ ఆర్ఆర్ అదిరిపోయింది. త్రివిక్ర‌మ్ ఆస్థాన నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పూజాహెగ్డే ఇందులో హీరోయిన్. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ చిత్రంలో నాగ‌బాబు ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా న‌టిస్తుండ‌టం విశేషం.
ఇదిలా ఉంటే ఈ చిత్ర కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. అక్క‌డే రెండు వారాలు చేసి.. ఆ త‌ర్వాత పొల్లాచ్చికి వెళ్ల‌నున్నారు. త్రివిక్ర‌మ్ కు పొల్లాచ్చి సెంటిమెంట్. త‌న ప్ర‌తీ సినిమా షూటింగ్ అక్క‌డ చేయ‌డం ఈయ‌న‌కు అల‌వాటే. ఇప్పుడు అర‌వింద స‌మేత కూడా దీనికి మిన‌హాయింపు కాదు. అనుకున్న‌ట్లుగానే అక్టోబ‌ర్ లోపు షూటింగ్ పూర్తి చేయ‌నున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here