ఎవ‌రో ఆ ముసుగు సుంద‌రి..?


క‌ళ్లు కూడా క‌నిపించ‌కుండా క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని పెట్టుకుని.. మొహాన్ని మొత్తం ముసుగుతో ముంచేసిన ఈ ముద్దుగుమ్మ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? క‌నీసం గుర్తు ప‌ట్టే ఛాన్స్ కూడా ఇవ్వ‌డం లేదు క‌దా. క‌ళ్లు చూసైనా క‌నిపెడ‌దాం అనుకుంటే గ్లాసెస్ ఆ అవ‌కాశాన్ని తీసుకెళ్లిపోయాయి. ఇకిప్పుడు ఈ ముసుగు సుంద‌రిని గుర్తు పట్ట‌డం ఎలా..? ఎక్కువ‌గా ఆలోచించ‌కండి.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా న‌టిస్తుంది. ప్ర‌భాస్ తోనే రొమాన్స్ చేస్తుంది. అవును.. మీరు గెస్ చేసిన పేరు క‌రెక్టే. ఈ ముసుగు సుంద‌రి పేరు శ్ర‌ద్ధాక‌పూర్. ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ వ‌ర‌స అవ‌కాశాల‌తో ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం షాహిద్ క‌పూర్ తో ఓ సినిమా చేస్తుంది శ్ర‌ద్ధాక‌పూర్. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగానే ఈ గెట‌ప్ వేసింది శ్ర‌ద్ధాక‌పూర్.
చాలా శ్ర‌ద్ధ‌గా మొహాన్ని ముసుగుతో క‌ప్పేసింది. చెప్పే వ‌ర‌కు కూడా క‌నిపెట్ట‌లేనంత‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం సాహో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది శ్ర‌ద్ధాక‌పూర్. త్వ‌ర‌లోనే శ్ర‌ద్ధా మ‌ళ్లీ ఈ టీంతో జ‌త క‌ల‌వ‌నుంది. ఈ సినిమాలో న‌టించ‌డం త‌న ల‌క్ అని చెబుతుంది శ్ర‌ద్ధా. మొత్తానికి ఈ భామ దూకుడు చూస్తుంటే సాహో త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీలోనూ జెండా పాతేయ‌డం ఖాయంగా క‌నిపి స్తుంది. అయితే ఆ జెండా పాతాలంటే ఇక్క‌డ నిర్మాత‌లు కూడా ఆస్తులు అమ్ముకోడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిగారు తీసుకునే రెమ్యున‌రేష‌న్ అలా ఉంటుంది మ‌రి. ఇప్పుడు సాహో కోసం కూడా ఏకంగా 4 కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది శ్ర‌ద్ధాక‌పూర్. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ శ్ర‌ద్ధాక‌పూర్ కు కావాల్సినంత ఇమేజ్ ఉంది కాబ‌ట్టి నాలుగు కోట్లు త‌క్కువే. కానీ ప్ర‌తీ సినిమాకు అలా ఇవ్వాలంటే నిర్మాత ల‌కు త‌డిసి మోపెడ‌వుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here