ఒక్క‌క్ష‌ణం.. బాగుంది.. మ‌రి పైస‌ల్..? 

Okka Kshanam
సినిమా బాగుంటే డ‌బ్బులు అవే వ‌చ్చేస్తాయి.. ఇది ఒకప్ప‌టి మాట‌. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఒక్కోసారి సినిమా బాగున్నా కూడా డ‌బ్బులు రావు. ఈ మ‌ధ్య చాలా సినిమాలు ఈ విష‌యాన్ని ప్రూవ్ చేసాయి. ఇప్పుడు ఒక్క‌క్ష‌ణం కూడా ఇదే నిరూపిస్తుంది. సినిమా చూసిన వాళ్లంతా ఓకే.. ప‌ర్లేదు.. కొత్త ప్ర‌య‌త్నం అంటున్నారు. కానీ క‌లెక్ష‌న్ల రూపంలో మాత్రం ఈ ప్ర‌య‌త్నం క‌నిపించ‌ట్లేదు. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి హిట్ త‌ర్వాత అల్లు శిరీష్.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సినిమా త‌ర్వాత విఐ ఆనంద్ చేసిన సినిమా ఒక్క‌క్ష‌ణం. ఆ క్రేజ్ బాగానే ఉంది కానీ ఎందుకో మ‌రి వ‌సూళ్ల విష‌యానికి వ‌చ్చేస‌రికి ఒక్క‌క్ష‌ణం బాగా వీక్ గా ఉన్నాడు. తొలిరోజు ఈ చిత్రానికి చాలా చోట్ల నామ‌మాత్ర‌పు వ‌సూళ్లు కూడా రాలేదు. ఇక రెండో రోజు కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొన‌సాగితే మంచి చిత్రాల జాబితాలోకి ఒక్క‌క్ష‌ణం కూడా చేర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మంచి సిన‌మాల‌కు తెలుగులో క‌లెక్ష‌న్లు రావ‌నే నానుడి ఉంది. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..? ఈ ఒక్క క్ష‌ణం క‌మ‌ర్షియ‌ల్ గానూ స‌త్తా చూపిస్తుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here