ఒక్క త‌ప్పుకు భాను ఔట్..!

బిగ్ బాస్ సీజ‌న్ 2 రోజురోజుకీ ఆస‌క్తి పెంచేస్తుంది. ఒక్కో వారం ఎలిమినేష‌న్ అవుతుంటే ఇంకా మ‌జా వ‌స్తుంది. కామ‌న‌ర్ గ‌ణేష్ ఒక్కో వారం ముగిసే స‌రికి స్ట్రాంగ్ అవుతున్నాడు.. చివ‌రి వ‌ర‌కు ఉంటారేమో అనుకున్న వాళ్లు మాత్రం ఒక్కొక్క‌రుగా ఇంటి నుంచి బ‌య‌టికి వ‌స్తున్నారు.
ఈ వారం భాను కూడా ఇలాగే బ‌య‌టికి వ‌చ్చింది. అస‌లు ఈమె ఎలిమినేట్ అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు కూడా. అయితే ఈ మ‌ధ్యే మంచి చెడు టాస్క్ లో కౌశ‌ల్ పై ఈమె చేసిన అబ‌ద్ధ‌పు ర‌చ్చ ఈమెపై భారీ ప్ర‌భావం చూపించింది. అప్ప‌ట్లో కౌశ‌ల్ పై కిరీట్ చేసిన ర‌చ్చ‌కు ఆయ‌న ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు భానుకు కూడా ఇదే గ‌తి ప‌ట్టింది.
మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగా ఆడిన భాను.. ఒక్క చిన్న విష‌యంలో త‌ప్పు చేసి ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. నాని కూడా ఈ ఎపిసోడ్ లో భానును టార్గెట్ చేయ‌డంతో ప్రేక్ష‌కులు కూడా త‌మ ఓటింగ్ డిసైడ్ చేసారు.  శ్యామ‌ల ఎలిమినేట్ అవ్వ‌డం షాక్  అనుకుంటే.. ఇప్పుడు భాను బ‌య‌టికి రావ‌డంతో ఏదైనా జ‌ర‌గొచ్చు అంటూ బిగ్ బాస్ ను మ‌రింత ఆస‌క్తిగా చూస్తున్నారు ప్రేక్ష‌కులు. మ‌రి ఈ వారం ఇంకెవ‌రు ఇంటి నుంచి బ‌య‌టికి వ‌స్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here