కథానాయకి కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా “మహానటి” కొత్త పోస్టర్ విడుదల

చిత్ర కథానాయకి కీర్తిసురేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నేడు (అక్టోబర్ 17) “మహానాటి” సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకుడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “కీర్తిసురేష్ కళ్ళతో పలికించే హావభావాలు, ఆమె సహజమైన అందం ఆడియన్స్ ను తప్పకుండా అలరిస్తుంది. సావిత్రిగా ఆమె నటన విశేషంగా ఆకట్టుకొంటుంది. “ఆకాశ వీధిలో అందాల జాబిల్లి” పోస్టర్ ను కీర్తిసురేష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నాం. ఈ పోస్టర్ సావిత్రిగారికి అంకితం” అన్నారు.