కీరవాణిగారు కంగ్రాట్స్ చెప్పడం కిక్కిచ్చింది! -సత్య గ్యాంగ్’ గీత రచయిత చంద్రబోస్

`రంగస్థలం’ పాటలకు వస్తున్న స్పందనకు ఉబ్బితబ్బిబ్బు అవుతున్న చంద్రబోస్ ఆనందం రెట్టింపు చేస్తూ.. `సత్య గ్యాంగ్’ చిత్రానికి చంద్రబోస్ రాసిన పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబోస్ స్వయంగా మీడియాతో పంచుకున్నారు. `సత్య గ్యాంగ్’ లో అనాధలపై రాసిన పాటకు అనూహ్యమైన స్పందన వస్తోందని.. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి మెచ్చుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇస్తోందని చంద్రబోస్ అన్నారు.
 సాత్విక ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ-వ్యాపారవేత్త మహేష్ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ‘ సత్య గ్యాంగ్’. ఈ చిత్రం త్వరలో విడుదల కానుండడాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గీత రచయిత చంద్రబోస్, హీరో సాత్విక్ ఈశ్వర్, హీరోయిన్ అక్షిత,  ఛాయాగ్రాహకులు అడుసుమిల్లి విజయ్ కుమార్ లతో పాటు ప్రముఖ దర్శకులు సముద్ర పాల్గొన్నారు.
సముద్ర మాట్లాడుతూ.. `చిత్ర నిర్మాత మహేష్ ఖన్నా నాకు ఎప్పటినుంచో తెలుసు. ఇటీవలే ఆయన తన తండ్రి జ్ఞాపకార్ధం కోటిన్నర విలువ చేసే స్థలాన్ని దానం చేశారు. అంత మంచి వ్యక్తి నిర్మించిన `సత్య గ్యాంగ్’ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతోపాటు.. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తూ.. దర్శకత్వ పర్వ్యవేక్షణ నిర్వహించిన మహేష్ ఖన్నా మాట్లాడుతూ.. ‘సమాజంలో అనాధలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి రూపొందించిన  చిత్రం ‘సత్య గ్యాంగ్’. హీరోగా పరిచయమవుతున్న సాత్విక్ ఈశ్వర్ కి చాలా మంచి భవిష్యత్ ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తాం. డబ్బులు ఎక్కువై కాదు ఇలా చెబుతున్నది.. సినిమాపై మాకున్న నమ్మకం వల్ల. ఇక సముద్ర గారు చెప్పినట్లుగా నేను కోటిన్నర ఖరీదు చేసే స్థలాన్ని మా నాన్నగారి జ్ఞాపకార్ధం, మా అబ్బాయి హీరోగా నటించిన సినిమా విడుదలవుతున్న సందర్భంగా దానం ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
`సత్య గ్యాంగ్’ వంటి మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్ టైనర్ లో నటించడం అదృష్టంగా భావిస్తున్నామని హీరోహీరోయిన్స్  సాత్విక్ ఈశ్వర్ అక్షిత అన్నారు.
ప్రత్యూష్, హర్షిత, సుమన్, సుహాసిని, కాలకేయ ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్ ఖన్నా, రాజేందర్, దిల్ రమేష్, బి.హెచ్.ఈ. ఎల్.ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్, కథ: సిద్ధయోగి క్రియేషన్స్, ఆర్ట్: డేవిడ్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాత-దర్శకత్వపర్యవేక్షణ: మహేష్ ఖన్నా, సంగీతం-దర్శకత్వం: ప్రభాస్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here