కుర్రాడు కొడితే చ‌రిత్రే.. 

తొలిప్రేమ.. ఈ టైటిల్ లోనే ఏదో మాయ ఉంది. 20 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం ఇప్ప‌టికీ నిత్యనూత‌న‌మే. ఇప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ ను మార్చిన సినిమాల్లో తొలిప్రేమ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ఇలాంటి సినిమా టైటిల్ ను ఇప్పుడు త‌న సినిమా కోసం వాడేసాడు కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. అస‌లు ఇంత ధైర్యం ఎక్క‌డ్నుంచి వ‌చ్చిందో తెలియ‌దు కానీ వెంకీ ఈ చిత్రంతో హిట్ కొడితే మాత్రం చ‌రిత్రే. ఆస‌క్తికరంగా అప్ప‌టి తొలిప్రేమ‌కి.. ఇప్ప‌టి తొలిప్రేమ‌కు కొన్ని పోలిక‌లున్నాయి. అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుస్వాగ‌తం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత తొలిప్రేమ చేసాడు. ఇప్పుడు ఫిదా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ చేసాడు. ఇక అప్పుడు క‌రుణాక‌ర‌ణ్ కు తొలిప్రేమ తొలి సినిమా. ఇప్పుడు వెంకీకి కూడా ఇదే తొలి సినిమా.
ప‌దేళ్లుగా ద‌ర్శ‌కుడు కావాల‌నే కోరిక‌ను త‌న‌లోనే అణుచుకున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు అవ‌కాశం రాగానే మొత్తం త‌న క‌సిని చూపించాడు. వెంకీ ఏ రేంజ్లో ఈ చిత్రం కోసం క‌ష్ట‌ప‌డ్డాడో.. క‌ల‌గ‌న్నాడో ఇప్పుడు స్క్రీన్ పై చూస్తుంటే అర్థ‌మైపోతుంది. ప్ర‌తీ ఫ్రేమ్ ను అందంగా మ‌లిచాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. పాట‌ల్లో ఉన్న ఫ్రెష్ నెస్.. విజువ‌ల్స్ చూస్తుంటే వెంకీ అట్లూరి ఏదో సాదాసీదాగా ఈ సినిమా తీసిన‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు. క‌చ్చితంగా క‌సిమీదే క‌నిపిస్తున్నాడు. లేక‌లేక వ‌చ్చిన అవ‌కాశం క‌దా.. అందుకే తొలి సినిమాతోనే త‌న టాలెంట్ అంతా చూపించేసాడు. అంద‌రిలా మాస్ దారిలో కాకుండా తొలి సినిమా కోసం మ‌న‌సును తాకే ప్రేమ‌ను ఎంచుకున్నాడు. పైగా తొలి సినిమాకే ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ వాడేసాడు ఈ కుర్రాడు. పైగా థ‌మ‌న్ నుంచి అద్భుత‌మైన సంగీతాన్ని రాబ‌ట్టుకున్నాడు వెంకీ అట్లూరి. ఇదంతా చూస్తుంటే అప్పుడు ప‌వ‌న్ సినిమా స్థాయిలో కాక‌పోయినా.. క‌నీసం స‌గం అందుకున్నా సినిమా బ్లాక్ బ‌స్ట‌రే. మ‌రి చూడాలిక‌.. ఫిబ్ర‌వ‌రి 9న రాబోయే ఈ తొలిప్రేమ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here