కుర్రాడు మ‌రీ క్రూరంగా ఉన్నాడబ్బా..!

Padmavati Scares Balakrishna’s Jai Simha & PSPK25?
బాలీవుడ్ ఫ్యూచ‌ర్ సూప‌ర్ స్టార్ గా ఈ మ‌ధ్య కాలంలో అంద‌రితోనూ ప్ర‌శంస‌లు అందుకుంటున్న హీరో ర‌ణ్ వీర్ సింగ్. సినిమా సినిమాకు త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ర‌ణ్ వీర్ సింగ్. ఈ కుర్రాడికి ఎందుకు అంత క్రేజ్ పెరిగిందో.. అత‌డు చేసిన సినిమాలే చెబుతాయి. ఈ త‌రంలో ఏ హీరో క‌నీసం ఊహ‌ల్లో కూడా లేని పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నాడు ర‌ణ్ వీర్. రామ్ లీలా, బాజీరావ్ మ‌స్తానీ లాంటి సినిమాలు ర‌ణ్ వీర్ ఇమేజ్ ను బాగా పెంచేసాయి. ఇక ఇప్పుడు భ‌న్సాలీ కాంబినేష‌న్ లో మూడోసారి పద్మావ‌తిలో విల‌న్ గా న‌టించాడు ఈ కుర్ర హీరో. విల‌న్ అంటే ఏదో అల్లా ట‌ప్పా కాదు.. అల్లావుద్దీన్ ఖిల్జీ. చ‌రిత్రలో అత‌డు ఎంత క్రూరుడో చ‌దువుకున్నాం.. ఇప్పుడు నిజంగా చూపించాడు ర‌ణ్ వీర్ సింగ్. అత‌న్ని చూసిన త‌ర్వాత క‌చ్చితంగా వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే. అంతగా ఆ పాత్ర‌లో లీన‌మైపోయాడు ర‌ణ్ వీర్ సింగ్. ట్రైల‌ర్ లోనే ర‌ణ్ వీర్ ను చూస్తుంటే అబ్బో కుర్రాడేంటి ఇంత క్రూరంగా ఉన్నాడు అనుకున్నారు. ఇప్పుడు సినిమా విడుద‌లైంది. ప‌ద్మావ‌తిపై క‌న్నేసే అల్లావుద్దీన్ ఖిల్జీగా న‌ట విశ్వ‌రూపాన్ని చూపించాడు ర‌ణ్ వీర్. ల‌వ‌ర్ బాయ్ లా క‌నిపించే ర‌ణ్ వీర్.. ఖిల్జీగా ర‌ప్ఫాడించాడంతే. సినిమా చూసినోళ్లంతా కుర్రాడేంటి ఇంత క్రూరంగా ఉన్నాడు అంటున్నారు. పైగా ఇలాంటి ర‌ఫ్ లుక్స్ తో కూడా అమ్మాయిల్ని ప‌డేస్తున్నాడు ర‌ణ్ వీర్. ఆ మ‌ధ్య ఈ లుక్ చూసి ఓ సెలెబ్రెటీ ట్విట్ట‌ర్ వేదిక‌గానే ర‌ణ్ వీర్ కు సెక్స్ ఆఫ‌ర్ చేసింది. అంత‌గా పాకిపోయింది ఈ లుక్ క్రేజ్. మొత్తానికి ఖిల్జీ పాత్ర‌కు ర‌ణ్ వీర్ ఎన్ని అవార్డులు దోచుకుంటాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here