కొణిదెల వార‌మ్మాయి పెళ్లి కార్డ్ వ‌చ్చేసింది..

         Happy Wedding
అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. నిజంగానే నిహారిక పెళ్లి కార్డ్ వ‌చ్చేసింది. సైలెంట్ గా ఈమె పెళ్లి ప‌నులన్నీ వేగంగా జ‌రిగిపోతున్నాయి. ఎవ‌రికీ చెప్ప‌కుండానే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేసింది ఈ భామ‌. ఇప్పుడు పెళ్లి కార్డ్ ఇచ్చేసి.. వ‌రున్ని కూడా ప‌రిచ‌యం చేసింది నిహారిక‌. అది కూడా వాలెంటైన్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14నే త‌నకు కాబోయే వాన్ని ప‌రిచ‌యం చేసింది ఈ భామ‌. అయితే ఇదంతా రియ‌ల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లోనే. అవును.. త‌న నెక్ట్స్ సినిమా ముచ్చ‌ట్ల‌న్నీ ప్రేమికుల రోజు నాడు బ‌య‌ట‌పెట్టింది కొణిదెల వార‌మ్మాయి. ఈమె న‌టిస్తోన్న హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
స‌మ్మ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌టం విశేషం. ఇప్పుడు ఈమె కెరీర్ కు హ్యాపీ వెడ్డింగ్ కీల‌కం. ఈ చిత్రానికి ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్న యువీ క్రియేష‌న్స్ బ్యానర్ బ్రాండ్ తో త‌ను కూడా తొలి విజ‌యం అందుకుంటాన‌ని ఆశిస్తుంది నిహారిక‌. ఈ మ‌ధ్యే త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ ఈమె న‌టించిన తొలి సినిమా విజ‌య్ సేతుప‌తితో ఒరు న‌ల్ల‌నాల్ పాతు సొల్రెన్ అనే సినిమాలో న‌టించింది. కానీ ఇది ఫ్లాప్. దాంతో కెరీర్ లో తొలి విజ‌యం కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది నిహారిక‌. చూడాలిక‌.. పెళ్లి ముచ్చ‌ట్లు అయినా నిహా తొలి హిట్ క‌ల‌ను నెర‌వేరుస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here