క‌న్న‌డ పోరి భ‌లే ఫాస్ట్ గురూ..!

బేసిగ్గా తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకోవ‌డం అంత ఈజీ కాదు. కానీ కొంద‌రు హీరోయిన్ల‌కు అది సాధ్యం అవుతుంది. వాళ్ల అదృష్టం కొద్దీ తొలి సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో అలా జ‌రుగుతుంది అప్పుడ‌ప్పుడూ. ఫిదాతో సాయిప‌ల్ల‌వి సుడి తిరిగిన‌ట్లే.. ఛ‌లోతో ర‌ష్మిక స్టార్ అయిపోయింది. ఆ సినిమా త‌ర్వాత ఇప్పుడు గీత‌గోవిందంతో వ‌స్తుంది ఈ భామ‌.
ఈ చిత్రంలో ఈమెకే కీ రోల్. విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నా కూడా క‌థ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు విడుద‌లైన ప్రోమోస్.. పాట‌ల్లోనూ ర‌ష్మిక హ‌వానే క‌నిపిస్తుంది. తాజాగా జ‌రిగిన ఆడియో వేడుక‌లో కూడా త‌న మాట‌ల‌తో అంద‌ర్నీ మాయ చేసింది.
అక్క‌డ బ‌న్నీ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా తాను మాట్లాడాల‌నుకున్న‌ది ధైర్యంగా మాట్లాడేసింది ఈ భామ‌. ఇక సినిమాలోనూ విజ‌య్ ను పూర్తిగా త‌న లుక్స్ ప్ల‌స్ యాక్టింగ్ తో డామినేట్ చేస్తుంది. ఆమెకు ధీటుగా విజ‌య్ కూడా రెచ్చిపోయాడు. ఇక పాట‌ల్లో ర‌ష్మిక ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ కు ప‌డిపోతున్నారంతా. మ‌రీ ముఖ్యంగా ఇంకేం కావాలి పాట‌లో అలా న‌డుం స‌ర్దుకుంటూ బొడ్డును చూపిస్తుంటే కుర్రాళ్లు చ‌చ్చిపోతున్నారు ఆ ఒక్క లుక్ కే.
ప్ర‌స్తుతం గీత‌గోవిందం తో పాటు నానితో దేవ‌దాసు సినిమాలో న‌టిస్తుంది ర‌ష్మిక‌. దాంతోపాటు మ‌రో రెండు సినిమాల్లోనూ ర‌ష్మిక‌ను తీసుకున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే డియర్ కామ్రేడ్ లో జ‌త‌క‌ట్టింది ఈ భామ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here