క‌మ్ముల మ‌ళ్లీ తెలంగాణ‌మే..!

ప‌దేళ్లు ఫ్లాపుల్లోనే ఉన్నాడు. అప్పుడు ఎవ‌రికీ అడ‌గ‌లేదు ఆయ‌న ఏం చేస్తున్నాడ‌ని. కానీ ఒక్క హిట్ వ‌చ్చిందో లేదో శేఖ‌ర్ క‌మ్ముల నెక్ట్స్ సినిమా ఏంట‌ని అంతా ఆరా తీస్తున్నారు. ఇండ‌స్ట్రీలో అంతే మ‌రి. ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు ఒక్క హిట్టొస్తే చాలు అంతా మ‌రిచిపోతుంటారు. అది హీరో అయినా.. ద‌ర్శ‌కుడైనా..! ఇప్పుడు శేఖర్ కమ్ముల విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. దానికి కార‌ణం ఫిదా. ఈ సినిమాకు సంచ‌ల‌న విజ‌యం అనే మాట కూడా చిన్న‌దే.. ఎందుకంటే అంత‌కంటే ఎక్కువే. తెలంగాణ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ ప్రేమ‌క‌థ 48 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. దాంతో ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల త‌ర్వాతి సినిమా ఏంటనే ఆస‌క్తి అంద‌ర్లోనూ మొద‌లైంది. చాలా రోజుల నుంచి ఈయ‌న మ‌న‌సు లీడ‌ర్ 2పై ఉంది. దీనికి క‌థ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు క‌మ్ముల‌.
ఇప్పుడు దాన్ని ప‌క్క‌న‌బెట్టి మ‌రో క‌థ సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా తెలంగాణ నేప‌థ్యంలోనే ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈయ‌న త‌ర్వాతి చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే తాను అనుకున్న లైన్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు చెప్పడం.. ఆయ‌న ఓకే అన‌డం కూడా జ‌రిగిపోయింది. ప్ర‌స్తుతం విజ‌య్ ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. దాంతో క‌మ్ముల సినిమా ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఈ కాంబినేష‌న్ వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. తెలంగాణ ప్రేమ‌క‌థే ఈ సినిమాలోనూ క‌నిపించ‌నుంది. విజ‌య్ ఎలాగూ తెలంగాణ యాస‌లో తోపు. పైగా ఈ కుర్రాడికి ఇప్పుడు కావాల్సినంత క్రేజ్ ఉంది. దానికి శేఖ‌ర్ క‌మ్ముల పెన్ ప‌వ‌ర్ కూడా తోడైతే ఇక ర‌చ్చ ర‌చ్చే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత‌. మొత్తానికి చూడాలిక‌.. ఫిదా మాదిరే మరోసారి శేఖ‌ర్ క‌మ్ముల ర‌చ్చ చేస్తాడేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here