ఖాన్స్ కాకుండా.. క‌పూరే పెట్టాడుగా..!


బాలీవుడ్ లో ఖాన్స్ ఆధిప‌త్యానికి చెక్ పెట్టే ద‌మ్ము ర‌ణ్ బీర్ క‌పూర్ కు ఉంద‌ని ఐదేళ్ల కిందే వార్త‌లు వినిపించాయి. అప్పుడే ఏ జ‌వానీ హై దివానీ లాంటి సినిమాల‌తో రికార్డులు సృష్టించాడు ఈ కుర్ర హీరో. అయితే ఆ త‌ర్వాత స‌డ‌న్ గా ఫామ్ కోల్పోయి వ‌ర‌స ఫ్లాపుల‌తో రేస్ లోంచి పూర్తిగా బ‌య‌టికి వ‌చ్చేసాడు ర‌ణ్ బీర్. అయితే ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ టైమ్ ట‌ర్న్ అయింది. సంజూ సినిమాతో ఈయ‌న ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు.
ఈ చిత్రం నాన్ ఖాన్స్ రికార్డుల‌న్నింటినీ తుడిచేసింది. ఖాన్స్ స‌పోర్ట్ లేకుండా ఇండియాలో 250 కోట్లు వ‌సూలు చేసింది రెండే రెండు సినిమాలు.. ఒక‌టి ప‌ద్మావ‌తి.. మ‌రోటి సంజూ. ఇప్పుడు స‌ల్మాన్, అమీర్ కాకుండా ఇండియాలో సోలోగా 300 కోట్ల క్లబ్ లోకి అడుగు పెడుతున్న ఏకైక హీరో ర‌ణ్ బీర్ మాత్ర‌మే. ఇప్ప‌టికే 289 కోట్లు వ‌సూలు చేసిన సంజూ.. మ‌రో రెండు రోజుల్లో 300 కోట్ల‌కు చేర‌డం ఖాయం.
ఈ చిత్ర తీరు చూస్తుంటే టైగ‌ర్ జిందా హై 302 కోట్లు.. సుల్తాన్ పేరు 317 కోట్ల రికార్డుల‌ను తుడిచిపెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. పైగా ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఏదీ లేక‌పోవ‌డం కూడా సంజూకు క‌లిసొస్తుంది. మూడో వారంలో కూడా సంజూ రోజుకు క‌నీసం 8 కోట్లు వ‌సూలు చేస్తుండ‌టం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here