గీత కోసం వేచిచూస్తున్న బ‌న్నీ..

GEETHA GOVINDAM ALLU ARJUN
గీత‌తో బ‌న్నీకి ఏంటి సంబంధం..? ఈమె కోసం అల్లుఅర్జున్ ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ సినిమా విడుద‌లైతే కానీ బ‌న్నీ ఫ్యూచ‌ర్ ఏంటో తెలియ‌దు. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఓ ద‌ర్శ‌కుడు వ‌చ్చి మంచి క‌థ చెప్పినా కూడా న‌మ్మ‌కం కుద‌రాలంటే ముందు ట్ర‌య‌ల్ వేయాలి. ఇప్పుడు బ‌న్నీ చేస్తున్న‌ది కూడా ఇదే. ఈయ‌న‌కు ప‌రుశురామ్ ఇప్ప‌టికే క‌థ చెప్పాడ‌ని తెలుస్తుంది.
గీతాఆర్ట్స్ లోనే ప‌రుశురామ్ రెండు సినిమాలు చేసాడు. ఇప్ప‌టికే శిరీష్ తో చేసిన శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు ఆడేసింది. అల్లుశిరీష్ కు హిట్టే రాదేమో అనుకుంటున్న టైమ్ లో ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్టైంది. ఇక ఇప్పుడు గీత‌గోవిందంతో వ‌స్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.
ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్.. ట్రైల‌ర్స్.. సాంగ్స్ అన్నీ అదిరిపోయాయి. దాంతోపాటే కాంట్ర‌వ‌ర్సీలు కూడా. ఏది ఎలా ఉన్నా ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత బ‌న్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది. గీత‌గోవిందం హిట్ అయితే ప‌రుశురామ్ కు గీతాఆర్ట్స్ లోనే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవ‌కాశం రానుంది. ఇప్ప‌టికే అల్లు అర‌వింద్ కూడా తాను త్వ‌ర‌లోనే బ‌న్నీతో సినిమా చేయ‌బోతున్నాన‌ని చెప్పాడు. అది ప‌రుశురామ్ తోనే కావ‌చ్చు. మ‌రి చూడాలిక‌.. గీత క‌రుణిస్తే కానీ ప‌రుశురామ్ జాత‌కం మార‌ద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here