గురువు రుణం తీర్చుకున్న అట్లీకుమార్..

SHANKAR-SURPRIZE-PARTY-25-YEARS
అట్లీకుమార్.. ఇప్పుడు ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈయ‌న తెర‌కెక్కించిన మూడు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లే. పైగా అందులో ఒక‌టి ఇండియ‌న్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించింది. రాజారాణి.. తెరీ.. మెర్స‌ల్ సినిమాల‌తో అట్లీ టాప్ డైరెక్ట‌ర్ అయ్యాడు. ఇంత ఎదిగినా కూడా త‌న గురువు ముందు మాత్రం ఇప్ప‌టికీ చిన్న పిల్లోడే ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న ఒక‌ప్పుడు శంక‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసాడు. రోబో సినిమాకు ఈయ‌న అసిస్టెంట్. అట్లీతో పాటు త‌మిళ్ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు అగ్ర‌ ద‌ర్శ‌కులుగా వెలిగిపోతున్న చాలా మంది శంక‌ర్ ద‌గ్గ‌ర ప‌ని చేసిన వాళ్లే.
ఈ బ్యాచ్ అంతా క‌లిసి ఇప్పుడు త‌మ గురువుకు ట్రీట్ ఇచ్చారు. శంక‌ర్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 25 ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా ఆయ‌న అసిస్టెంట్స్ అంతా క‌లిసి శంక‌ర్ కు స‌ర్ ప్రైజ్ పార్టీ ఇచ్చారు. 1993లో వ‌చ్చిన జెంటిల్ మ‌న్ తో ఈయ‌న ద‌ర్శ‌కుడిగా మారాడు. ఆ త‌ర్వాత ప్రేమికుడు.. భార‌తీయుడు.. ఒకే ఒక్క‌డు లాంటి సంచ‌ల‌న సినిమాలు తెర‌కెక్కించాడు శంక‌ర్. ఇప్పుడు 2.0 తో బిజీగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో త‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్స్ గా ప‌ని చేసిన వ‌సంత‌బాల‌న్.. అట్లీకుమార్.. బాలాజీ శ‌క్తివేల్ లాంటి వాళ్లంతా క‌లిసి గురువుకు పార్టీ ఇచ్చారు. ఈ ఫోటో షేర్ చేసి మీరు లేకుండా నా జ‌ర్నీ ఇంత బాగా ఉండేది కాదంటూ ట్వీట్ చేసాడు శంక‌ర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here