"గూఢచారి"తో సుప్రియా యార్లగడ్డ రీఎంట్రీ

Supriya-Yarlagadda-returns-with-‘Goodachari’
దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్ళీ వెండితెరకు “గూఢచారి”తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ పోషిస్తున్న నదియా ఖురేషీ పాత్ర లుక్ ను ఇవాళ విడుదల చేశారు. రా ఏజెన్సీకి కి చెందిన త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే సీక్రెట్ ఏజెంట్ గా మిస్టీరియస్ ఏజెంట్ గా కనిపించే ఈమె రా ఏజెన్సీలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ చీఫ్ టాస్క్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఈమె 92 FS తుపాకీని క్యారీ చేస్తుంది.
“గూఢచారి” చిత్రంలో సుప్రియా యార్లగడ్డ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు సినిమాకి కీలకం కానుంది. ఇటీవల విడుదలైన “గూఢచారి” టీజర్ కి విశేషమైన స్పందన లభించింది. యూట్యూబ్ లో ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. 116 రోజులపాటు 168 లొకేషన్స్ లో షూట్ చేయబడ్డ ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. శశికిరన్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
నటీనటులు:
అడవి శేష్, శోభిత దులిపాళ్ల, ప్రకాష్ రాజ్, మధు షాలిని, అనిష్ కురివెల్ల, సుప్రియ యార్లగడ్డ, వెన్నెల కిషోర్, రాకేష్ వర్రి.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: శశి కిరణ్ తిక్క
కెమెరామెన్: శనీల్ డియో
స్టోరి: అడవి శేష్
స్క్రీన్ ప్లే: అడవిశేష్ , శశి కిరణ్ తిక్క, రాహుల్ పాకాల
డైలాగ్స్ , స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఎడిటర్: గారి బి.హెచ్
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావ్
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గరపు
యాక్షన్ కొరియోగ్రఫీ: రాబిన్ సబ్బు, నబ స్టంట్స్, అర్జున్ శాస్త్రి
పి. ఆర్.ఓ: వంశి శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిట్టు సూర్యన్
కో.ప్రొడ్యూసర్: వివేక్ కూచిబోట్ల
ప్రొడ్యూసర్: అభిషేక్ నమ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విస్ట డ్రీమ్ మర్చంట్స్.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here