గ్యాంగ్ నిల‌బ‌డిన‌ట్టేనా.. ప‌రిస్థితేంటి..
సంక్రాంతి సినిమాల్లో అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన సినిమా సూర్య గ్యాంగ్. అస‌లే మ‌న సినిమాల మ‌ధ్య భారీ పోటీ ఉంటే వాటి మ‌ధ్య‌లో దూరిపోయాడు సూర్య‌. గ్యాంగ్ సినిమాతో ఈయ‌న వ‌చ్చాడు. ఈ చిత్రానికి తొలిరోజు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. త‌మిళ‌నాట ఓకే అన్నారు కానీ తెలుగులో మాత్రం కాస్త డౌటే అన్నారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి రివ‌ర్స్ అయ్యేలా క‌నిపిస్తుంది. త‌మిళ‌నాటే ఈ సినిమా వ‌సూళ్లు త‌క్కువ‌గా ఉన్నాయి. ఇక్క‌డ అమ్మిన రేట్స్ తో పోలిస్తే తెలుగులోనే గ్యాంగ్ సేఫ్ అయ్యేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే నాలుగు రోజుల్లో ఇక్క‌డ 3.7 కోట్ల షేర్ వ‌సూలు చేసింది గ్యాంగ్. ఇదే నిజ‌మైతే మ‌రో కోటి తీసుకొస్తే చాలు సినిమా సేఫ్ అయిపోతుంది. సంక్రాంతి సినిమాల్లో సేఫ్ జోన్ కు వ‌చ్చిన తొలి సినిమా ఇదే అవుతుంది. స్పెష‌ల్ ఛ‌బ్బీస్ లాంటి సినిమాను ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు తెర‌కెక్కించ‌డంలో విఘ్నేష్ స‌ఫ‌లం కాలేదంటున్నారు విశ్లేష‌కులు. అయినా కానీ బ‌రిలో మ‌రో సినిమా లేక అక్క‌డ ఇక్క‌డా సూర్య సినిమా బాగానే వ‌సూలు చేస్తుంది. సెల‌వులు పూర్త‌య్యాయి కాబ‌ట్టి ఇప్ప‌ట్నుంచీ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది ముఖ్యం. ఇప్పుడు కానీ త‌ట్టుకుని నిల‌బ‌డితే సినిమా సేఫ్ అయిన‌ట్లే. లేదంటే మ‌రో ఫ్లాప్ సూర్య ఖాతాలో చేరిన‌ట్లే. ఇప్ప‌టికే అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ అయినా కూడా బాల‌య్య మాత్రం జై సింహాతో మాస్ ప‌వ‌ర్ చూపిస్తున్నాడు. దాంతో సూర్య‌కు ఇక్క‌డ అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. మొత్తానికి గ్యాంగ్ చివ‌రి ప్ర‌యాణం ఎక్క‌డికి వ‌స్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here