ఘ‌నంగా జ‌రుగుతున్న ఎంసిఏ ఈవెంట్.. 

MCA Pre Release Event Photos (1)

హ‌న్మ‌కొండలో ఎంసిఏ ఈవెంట్ ఘ‌నంగా జ‌రుగుతుంది. నానితో పాటు చిత్ర‌యూనిట్ అంతా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ర‌చ్చ‌ర‌వి, ప్రియ‌ద‌ర్శితో పాటు సినిమాలో న‌టించిన మిగిలిన క‌మెడియ‌న్లు కూడా వేదిక‌పై అద్భుత‌మైన స్కిట్లు చేసి న‌వ్వించారు. ఇక ఎంసిఏ వేడుక‌కు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ముఖ్యఅతిథిగా వ‌చ్చారు. హ‌న్మ‌కొండ‌లోని ఈవెంట్ జ‌రుగుతున్న స్టేడియం అంతా నాని.. నాని అంటూ అభిమానుల కేరింత‌లతో మారుమోగిపోతుంది.

MCA Pre Release Event Photos (1)

ఇక సాయిప‌ల్ల‌వి కూడా చీర‌క‌ట్టిన చంద‌మామ‌లా వేడుక‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. దిల్ రాజుకు వ‌రంగ‌ల్లో రాజ‌కీయ నేత‌ల‌తోనూ బాగానే ప‌రిచ‌యం ఉండ‌టంతో అక్క‌డి పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కూడా ఎంసిఏ ఈవెంట్ లో క‌నిపించారు. నిర్మాత దిల్ రాజు ఎంసిఏ గురించి మాట్లాడుతూ.. ఇది ప్ర‌తీ ఇంటి సినిమా క‌చ్చితంగా క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని చెప్పాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ త‌న రాకింగ్ ప‌ర్ఫార్మెన్స్ తో స్టేజ్ ను ఊపేసాడు. అభిమానులు నాని స్పీచ్ కోసం వేచి చూస్తున్నారు. ఆయ‌నేం మాట్లాడతాడో అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా చూస్తున్నారు. మొత్తానికి వేడుక అయితే క‌న్నుల పండ‌గ‌గా జ‌రుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here