చిట్టి నిక్క‌రులో ఐశ్వ‌ర్యారాయ్..

AISHWARYA-RAI
అమ్మ బ్ర‌హ్మ‌దేవుడో.. కొంప ముంచినావురో.. అంటూ అప్ప‌ట్లో శ్రీ‌దేవి కోసం పాడారు కానీ ఈ పాట‌లో కాస్త భాగం ఐశ్వ‌ర్యారాయ్ కు కూడా ఇవ్వొచ్చు. ఎందుకంటే ఆమె అందం అలాంటిది మ‌రి. నిజం చెప్పండి.. ఈ ఫోటో చూసాక ఎవ‌రైనా ఐష్ కు 44 ఏళ్లంటే న‌మ్మ‌డం సాధ్య‌మా..? అస‌లు 40 దాటితే ఆంటీ అనాల‌ని ఎవ‌డు క‌నిపెట్టాడో కానీ వాడికి ఐష్ ను ఒక్క‌సారి చూపించాలి. ఇక వాడు మ‌ళ్లీ చ‌చ్చినా ఆంటీ అన‌డేమో..? ఎందుకంటే ఆంటీ ప‌దానికి పూర్తిగా యాంటీ ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా అమ్మాయిగారు అదిరిపోయే ఫోటోషూట్ తో మ‌తులు పోగొట్టేసారు.
పెళ్లైతే ఏంటి.. త‌ల్లైతే ఏంటి.. స్క్రిప్ట్ డిమాండ్ చేయాలే గానీ తాను రెచ్చిపోడానికి రెడీగా ఉన్నానంటోంది ఐశ్వ‌ర్యారాయ్. అస‌లు ఈ భామ ఇంత‌గా హాట్ నెస్ పెంచేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు కూడా. మొన్న‌ ఏ దిల్ హై ముష్కిల్ లో త‌న‌కంటే తొమ్మిదేళ్లు చిన్న‌వాడైన ర‌ణ్ బీర్ క‌పూర్ తో ఐష్ చేసిన‌ రొమాన్స్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు.
ఏ దిల్ హై ముష్కిల్ కోసం చాలానే చేసిన ఐష్.. ఇప్పుడు దానికి సీక్వెల్ చేస్తోంది. అంటే కొంప‌దీసి సినిమాకు సీక్వెల్ వ‌స్తుంది అనుకోకండి. హాట్ షోకు సీక్వెల్ వ‌స్తుంద‌న్న‌మాట‌. ఆ మ‌ధ్య‌ వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఐష్. అదిరిపోయే క్లీవేజ్ షో కు తోడు.. హాట్ హాట్ థైస్ ను వ‌డ్డింపుకు పెట్టింది ఐశ్వర్యారాయ్. ఇక ఇప్పుడు కూడా మ‌రో మ్యాగ‌జైన్ కోసం చిట్టి నిక్క‌ర్ వేసుకుని ర‌చ్చ చేసింది ఐశ్వ‌ర్యారాయ్.
ఈ డ్ర‌స్ లో ఆమె అరిపించిన తీరు చూసి కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌దేమో..? ఆ స్థాయిలో రెచ్చిపోయింది అందాల ఐష్. ఇది చూసిన త‌ర్వాత కూడా బాబోయ్ ఎలా ఈ అందాన్ని త‌ట్టుకోవాలి అనిపిస్తుంది. మ‌రోవైపు చాలా ఏళ్ళ త‌ర్వాత భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ తో క‌లిసి న‌టించ‌బోతుంది ఈ భామ‌. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్ల‌తో దున్నేస్తుంది ఐశ్వ‌ర్యారాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here