చిన‌బాబు రైతుల్ని గెలిపిస్తాడా..?


ఖాకీ సినిమాతో తెలుగులోనూ మంచి విజ‌యం అందుకున్నాడు కార్తి. ఈ చిత్రంతో మ‌రోసారి కార్తి సినిమాల‌కు తెలుగులో క్రేజ్ పెరిగిపోయింది. ఈ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు చిన‌బాబు సినిమాను అటు ఇటు ఒకేసారి విడుద‌ల చేస్తున్నాడు ఈ హీరో. పైగా ఈ చిత్రానికి సూర్య నిర్మాత‌. త‌మ్ముడితో ఈయ‌న నిర్మించిన తొలి సినిమా ఇదే. పాండిరాజ్ ద‌ర్శ‌కుడు. తెలుగులో జ‌య జాన‌కి నాయ‌కాను అందించిన మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నాడు.
జులై 13న చిన‌బాబు విడుద‌ల కానుంది. ట్రైల‌ర్ లోనే ఇది ప‌క్కా మాస్ సినిమా అని చూపించేసాడు ద‌ర్శ‌కుడు పాండిరాజ్. పైగా రైతు క‌థ‌తో ఇది తెర‌కెక్కింది. యూనిక్ క‌థ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు ఈజీగా క‌నెక్ట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు ద‌ర్శ‌కుడు. పుట్టించేవాడు దేవుడు అయితే.. పండించే వాడు కూడా దేవుడే.. రైతు అయితే కాల‌ర్ ఎగ‌రేయ్ అంతే అంటూ కార్తి చెప్పిన డైలాగ్స్ బాగానే పాపుల‌ర్ అవుతున్నాయి. కాక‌పోతే సినిమాలో త‌మిళ వాస‌న‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అఖిల్ ఫేమ్ సయేషా సైగ‌ల్ ఈ చిత్రంలో హీరోయిన్. మొత్తానికి చూడాలిక‌.. చినబాబుతో కార్తి ఎలాంటి మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here