చిరంజీవికి అత‌డు ఫిక్స్ అయ్యాడు..!

SYERA MUSIC DIRECTOR AMITH TRIVED
చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరాకు అన్నీ ఆదిలోనే అడ్డంకులు వ‌చ్చాయి. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న టైమ్ ప్ర‌కారం మొద‌లైనా కూడా మొద‌లైన త‌ర్వాత అస‌లు అడ్డంకులు వ‌చ్చాయి. కానీ అన్నింటినీ దాటుకుని ఇప్పుడు సైరా షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే 40 శాతం షూట్ పూర్త‌యింది. ప్రస్తుతం హైద‌రాబాద్ లో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ సినిమా మొద‌ల‌వ్వ‌క ముందే సినిమాటోగ్ర‌ఫ‌ర్ ర‌వివ‌ర్మ‌న్ త‌ప్పుకున్నాడు.
ఆయన స్థానంలోకి ర‌త్న‌వేలును తీసుకున్నాడు మెగాస్టార్. అక్క‌డ‌క్క‌డా కొన్ని షాకులు త‌గిలినా వెంట‌నే వాటికి మందు రాసేసి మ‌ళ్లీ గాడిన పెట్టాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్. కానీ ఇప్పుడు అనుకోని క‌ష్టం ఒక‌టి ఎదురైంది. దాని పేరు సంగీత ద‌ర్శ‌కుడు. ఈ విష‌యంలో అభిమానుల‌తో పాటు త‌న మ‌న‌సుకు కూడా ఆ ఒక్క విష‌యంలో స‌మాధానం చెప్పుకోలేక‌పోతున్నాడు. ఉన్న‌ట్లుండి రెహ‌మాన్ త‌ప్పుకోవ‌డాన్ని చిరంజీవి అంత ఈజీగా జీర్ణించుకోలేక‌పోతున్నాడు. థ‌మ‌న్ అనుకున్నా కూడా ఇంత పెద్ద సినిమాను ఆయ‌న హ్యాండిల్ చేయ‌లేడ‌నే టాకే ఎక్కువ‌గా వినిపిస్తుంది.
అందుకే మెగా ఫ్యామిలీ కూడా థ‌మ‌న్ వైపు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌నుకుంటున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ కూడా హిస్టారిక‌ల్ మూవీస్ కు స‌రైన వ్య‌క్తి కాదేమో అనే వాద‌న వినిపిస్తుంది. దాంతో ఇప్పుడు మిగిలిన ఏకైక ఆప్ష‌న్ కీర‌వాణి. ఈయ‌న అయితేనే సైరా సినిమాకు స‌రైన న్యాయం చేస్తాడంటున్నారు కొంద‌రు. పైగా బాహుబ‌లి లాంటి సినిమాకు సంగీతం అందించి ప్ర‌పంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు కీర‌వాణి.
ఈయ‌న ఆర్ఆర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. అందుకే సైరాకు ఆయ‌నే క‌రెక్ట్ అంటున్నారు కొంద‌రు. పైగా చిరంజీవితో కీర‌వాణిది సూప‌ర్ హిట్ బంధం. వీళ్ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాలు విజ‌యం సాధించాయి. కానీ ఈయ‌న‌పై చిరు ఆస‌క్తి చూపించ‌డం లేదు. దాంతో పాటు బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది పేరు కూడా వినిపించింది. ఈయ‌న్నే దాదాపు క‌న్ఫ‌ర్మ్ చేసేలా క‌నిపిస్తున్నారు. చ‌ర‌ణ్ కూడా ఇప్ప‌టికే ఈయ‌న‌తో మాట్లాడాడు. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న టీంతో ఎప్పుడు జాయిన్ అవుతాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here