చిరంజీవికి.. మామూలు పొగ‌డ్త‌లు కావ‌వి.. 

 HELLO!-Pre-Release-Event-Photos
చిరంజీవికి ఎప్పుడు ఎక్క‌డ ఎలా ఉండాలో బాగా తెలుసు. మ‌రీ ముఖ్యంగా మీడియా ముందు ఎలా మాట్లాడాలో ఆయ‌న‌కు తెలిసిన‌ట్లుగా మ‌న ఇండ‌స్ట్రీలో మ‌రే హీరోకు తెలియ‌దేమో..? మొన్న‌టికి మొన్న తెలుగు మ‌హాస‌భ‌ల్లో కేసీఆర్ ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తిన చిరంజీవి.. ఇప్పుడు హ‌లో ప్రీ రిలీజ్ వేడుక‌లో అఖిల్ ను ఆకాశానికి ఎత్తేసాడు. అస‌లు చిరు చెప్పిన తీరు చూస్తే అఖిల్ ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ అయిపోవాల్సిందే. హ‌లో చూసిన త‌ర్వాతే చిరంజీవి ఈ మాట‌లు మాట్లాడాడు. అస‌లు సినిమాలో అఖిల్ ప‌ర్ఫార్మెన్స్ చూసి తాను క‌ళ్ళ నీళ్లు పెట్టుకున్నాన‌ని చెప్పాడు మెగాస్టార్. ఈ చిత్రంలో అమ్మానాన్న‌ల‌ను అఖిల్ క‌లుసుకున్న‌పుడు వ‌చ్చే సెంటిమెంట్ త‌న‌కు క‌న్నీరు తెప్పించింద‌ని.. అస‌లు ఆ సీన్ లో అఖిల్ లోని న‌టున్ని చూసి చాలా ఆనందం వేసింద‌న్నాడు చిరంజీవి. అంతేకాదు.. డాన్సుల్లోనూ కుమ్మేసాడు. నాగార్జున కంటే అఖిల్ గొప్ప న‌టుడు కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు మెగాస్టార్.
తాత‌గారి ఆశీస్సులు ఎప్పుడూ అఖిల్ తోనే ఉంటాయ‌న్నాడు చిరంజీవి. హ‌లో ఆడియో వేడుక‌లో నాగ్ 5 నిమిషాలు మాట్లాడితే.. చిరంజీవి 15 నిమిషాలు మాట్లాడాడు. అస‌లు చ‌ర‌ణ్ తో అఖిల్ మాట్లాడే తీరు.. త‌మ ఇంటికి వ‌చ్చిన‌పుడు క‌లిసే తీరు చూసిన‌పుడు సురేఖ కూడా చాలా ఆనంద‌ప‌డుతుంద‌ని చెప్పాడు చిరంజీవి. అఖిల్ ను చూసి నిజంగానే చ‌ర‌ణ్ కు ఇలాంటి ఓ త‌మ్ముడు ఉంటే ఎంత బాగున్నో అని సురేఖ త‌న‌తో అంటుంద‌ని చెప్పాడు చిరంజీవి. ఆ వెంట‌నే ఎందుకు మ‌న‌కు.. అఖిల్ ఉన్నాడుగా అని తానే సురేఖ‌తో చెప్పా అని మ‌న‌సులో మాట చెప్పాడు చిరంజీవి. మెగాస్టార్ మెగా మాట‌లు వింటుంటే అస‌లు అక్కినేని, మెగా ఫ్యామిలీ మ‌ధ్య ఎంత చ‌క్క‌టి అనుబంధం ఉందో అర్థ‌మ‌వుతుంది. మొత్తానికి అఖిల్ ను 24 ఏళ్ల‌కే మునగ చెట్టెక్కించేసాడు మెగాస్టార్. మ‌రి అక్క‌డ్నుంచి అఖిల్ ఎలా కింద‌కి దిగుతాడో ఏమో మ‌రి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here