ఒకప్పుడు తమ సినిమాలకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారంటే గర్వంగా చెప్పుకునే వాళ్లు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు అది కామన్ సీన్ అయిపోయింది. ప్రతీ సినిమాకు హాలీవుడ్ నుంచి టెక్నికల్ టీమ్స్ దిగుతున్నారు. ఇప్పుడు కూడా సైరా విషయంలో ఇదే జరుగుతుంది. ఈ మధ్య మన సినిమాలన్నింటికీ హాలీవుడ్ స్టంట్ మాస్టర్సే ఎక్కువగా పని చేస్తున్నారు. సైరా కోసం జేమ్స్ బాండ్ ఫేమ్ గ్రెగ్ పావెల్ టాలీవుడ్ కు వస్తున్నాడు.
ఈయన గతంలో చాలా హాలీవుడ్ సినిమాలకు పని చేసాడు. జేమ్స్ బాండ్ సిరీస్ లోని స్కై ఫాల్ కి కూడా గ్రెగ్ ఫైట్స్ కంపోజ్ చేసాడు. ప్రస్తుతం ఈయన చిరు కోసం పని చేస్తున్నాడు. ఇప్పుడు సైరా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. బ్రిటీష్ వాళ్లపై ఉయ్యాలవాడ పోరాడి మరీ గన్స్ అన్నీ దోచుకునే సీన్స్ ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. ఇవి నెక్ట్స్ లెవల్లో ఉండాలని ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ను రంగంలోకి దించాడు.
40 రోజులు జరిగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయినట్లే. డిసెంబర్ లోపు షూటింగ్ అంతా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.