చిల‌సౌ పాట కూడా అదిరింది..

Sushanth ChiLaSow
ఏంటో అన్నీ కొత్త‌గా ఉన్నాయి. అక్కినేని మేన‌ల్లుడికి టైమ్ మారేలా క‌నిపిస్తుంది. సుశాంత్ న‌టిస్తున్న చిల‌సౌలో తొలిపాట విడుద‌లైంది. ఏమైందో తెలుసా అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది. పైగా ఇందులో హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. రూహిణి శ‌ర్మ ఇందులో హీరోయిన్. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు విడుద‌లైన మెల్ల‌గా మెల్ల‌గా పాట‌ను ద‌ర్శ‌కుడు రాహుల్ రవీంద్ర‌న్ భార్య చిన్మ‌యి పాడింది.
ప‌దేళ్ళ‌లో ఎప్పుడూ సుశాంత్ సినిమాకు రాని ఓ పాజిటివ్ వైబ్రేష‌న్ ఇప్పుడు ఎందుకో కానీ చిల‌సౌకు క‌నిపిస్తుంది. ఎప్ప‌ట్లా రొటీన్ కాకుండా ఈ సారి కాస్త కొత్త‌గా ట్రై చేసిన‌ట్లు క‌నిపిస్తున్నాడు ఈ కుర్రాడు. న‌టుడిగా స‌క్సెస్ కాలేని రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ల‌క్ టెస్ట్ చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్ తో పాటు పాట‌లు కూడా బాగుండ‌టంతో తెలియ‌కుండానే చిలసౌపై ఆస‌క్తి పెరిగిపోతుంది. పెళ్లి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం త‌న కెరీర్ లో తొలి విజ‌యం అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు సుశాంత్. జులై 27న చిల‌సౌ విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిరంజీవి ల‌క్ష్మీ సౌభాగ్య‌వ‌తి అయినా సుశాంత్ కు కోరుకున్న విజ‌యం తీసుకొస్తుందో రాదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here