చైతూ చేతికి అన్న‌పూర్ణ స్టూడియోస్..

NagaChaitanya,Samantha & Rana In An Family Event!అవును.. ఇప్పుడు మీరు చూస్తున్న‌ది నిజ‌మే. ఇన్నాళ్లూ ఇన్నేళ్లు అన్న‌పూర్ణ స్టూడియోస్ అంటే నాగార్జున పేరు గుర్తొచ్చేది. ముందు ఈ సంస్థ‌ను ప్రాణంగా చూసుకున్నాడు నాగేశ్వ‌ర‌రావ్. ఆయ‌న త‌ర్వాత పెద్ద కుమారుడు వెంక‌ట్ ఈ నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకున్నాడు. ఒక‌ప్పుడు వెంకట్ – నాగార్జున క‌లిసి సినిమాలు నిర్మించారు. ఆ త‌ర్వాత నాగార్జునే పూర్తిగా హ్యాండోవ‌ర్ చేసుకున్నాడు. అంటే అన్ని ప‌నులు ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు.
అందుకే చాలా సినిమాల‌కు నాగార్జున పేరు నిర్మాత‌గా ప‌డింది. ఇప్ప‌టికీ కొన‌సాగుతుంది కూడా. ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన సుశాంత్ చిలసౌకు కూడా నాగార్జున పేరు ప‌డుతుంది. ఇప్పుడు నాగ్ ఉన్న బిజీతో ఈయ‌న త‌ప్పుకుని ఈ బాధ్య‌త‌ల‌న్నీ పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య‌కు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది.
ఇప్ప‌టికే చిల‌సౌ ప్ర‌మోష‌న్స్ అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు నాగ‌చైత‌న్య‌. అన్నీ ఈయ‌న‌కు తెలిసిన త‌ర్వాతే జ‌రుగుతున్నాయి.
దీన్ని చూసి పిదా అయిపోయిన నాగార్జున‌.. ఇక‌పై స్టూడియో బాధ్య‌త‌లు పూర్తిగా త‌న‌యుడికే ఇవ్వాల‌ని ఫిక్స్ అయి న‌ట్లుగా తెలుస్తుంది. పైగా చిల‌సౌ ప్ర‌మోష‌న్స్ లో సమంత పాత్ర కూడా మ‌ర‌వ‌లేనిది. త‌న‌కు ఉన్న సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ ను కూడా ఈ చిత్రం కోసం వాడేసింది స‌మంత‌. ఇప్ప‌ట్నుంచి భ‌ర్త‌తో పాటే అన్న‌పూర్ణ స్టూడియోస్ ను జాగ్ర‌త్త‌గా కాపాడ‌నుంది స్యామ్. అందుకే ఇప్పుడు కొడుకు కోడ‌లికి త‌న బ్యాన‌ర్ బాధ్య‌త‌లు నాగార్జున ఇచ్చేసి హాయిగా రెస్ట్ తీసుకోబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here