చ‌క్క‌న‌మ్మా.. ఎంతగా చిక్కెన‌మ్మా..?


 
 
 
 
 
 
 
 
 
 
కొన్నిసార్లు మ‌న క‌ళ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేం. ఇప్పుడు అంజ‌లిని చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన ఈ భామ ఇప్పుడు చాలా స‌న్న‌గా మారిపోయింది. మెరుపుతీగ‌కు చెల్లిగా మారిపోయింది ఈ సీత‌మ్మ‌. న‌ల్ల‌టి డ్ర‌స్సులో కాళ్లు చూపిస్తూ సెక్సీగా చంపేస్తుంది అంజ‌లి. సినిమాలు లేవ‌నే బెంగో.. లేదంటే సినిమాల కోసమే స‌న్న‌బ‌డిందో తెలియ‌దు కానీ ఇప్పుడు మెరుపుతీగ‌లా మారిపోయింది ఈ రాజోలు సుంద‌రి. ఈ భామ‌కు తెలుగులో ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎందుకంటే తెలుగు నుంచే త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ స్టార్ హీరోల‌తో కూడా న‌టించింది. కానీ ఏం చేస్తాం.. స్టార్ ఇమేజ్ మాత్రం తెచ్చుకోలేక‌పోయింది. ఇక్క‌డ కూడా స్టార్స్ తో న‌టించినా అంజ‌లి జాత‌కం మార‌లేదు. చివ‌రికి ఐటం సాంగ్స్ చేసినా కూడా అంజ‌లిని తెలుగు ఇండ‌స్ట్రీలో ప‌ట్టించుకోవ‌డం లేదు. దాంతో చిన్నాచిత‌కా సినిమాల‌తో కాలం గ‌డిపేస్తోంది ఈ బ్యూటీ. మ‌రో వైపు త‌మిళ‌నాట త‌న ప్రియుడు జైను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంది అంజ‌లి. ఈ మ‌ధ్య బాగా లావుగా మారిపోయిన అంజ‌లి.. మ‌రోసారి ఫిజిక్ పై దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా విడుద‌లైన ఓ లుక్ లో స‌న్న‌గా మెరుపుతీగ‌లా మారిపోయింది. ఈ లుక్ తో అయినా మ‌రో రెండు మూడు సినిమాలు ప‌ట్టేద్దామ‌ని ప్లాన్ చేస్తుంది. మ‌రి ఈ సీత‌మ్మ లుక్ కు ప‌డిపోయే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here