చ‌ర‌ణ్ కూడా సైకిల్ ఎక్కేసాడుగా..!

'Rangasthalam' Shoot To Resume Shortly
ఏంటో ఈ మ‌ధ్య మెగా హీరోల మ‌న‌సు సైకిల్ వైపు బాగా వెళ్తుంది. మొన్న‌టికి మొన్న అజ్ఞాత‌వాసిలో సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ సినిమాలో ప‌దే ప‌దే చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. అది ప్రేక్ష‌కుల్లోకి మ‌రో ర‌కంగా కూడా వెళ్లింది. సైకిల్ అంటే బ‌య‌ట టిడిపి అని అర్థం. ఎలాగూ తెలుగు దేశానికి ప‌వ‌ర్ స్టార్ మిత్ర‌ప‌క్షం కూడానూ. అలా సినిమా ఫ్లాపైనా కూడా సైకిల్ డైలాగ్ బాగానే పేలింది. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా సైకిల్ ఎక్కేసాడు. ఈయ‌న త‌న కొత్త సినిమా రంగ‌స్థ‌లంలో సైకిల్ పై కూర్చుని వ‌స్తున్నాడు. తాజాగా టీజ‌ర్ మ‌రో రెండు రోజుల్లోనే అనే పోస్ట‌ర్ విడుద‌లైంది. అందులో రంగుల క‌ళ్ల‌జోడు పెట్టుకుని.. సైకిల్ తొక్కుతూ క‌నిపించాడు రామ్ చ‌ర‌ణ్. ఈ పోస్ట‌ర్ చూసిన వాళ్లంతా ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా సైకిల్ ఎక్కేసాడే అంటున్నారు. రంగ‌స్థ‌లం షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. తాజాగా రాజ‌మండ్రిలోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఫిబ్ర‌వ‌రిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తిచేసి.. మార్చ్ 30న సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది రివేంజ్ డ్రామా అని తెలుస్తుంది. రంగ‌స్థ‌లం క‌చ్చితంగా చ‌ర‌ణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. చూడాలిక‌.. చ‌ర‌ణ్ సైకిల్ పై వ‌చ్చి ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here