ఛార్మి.. పూరీకి బాగా క‌నెక్ట్ అయిపోయిందే..!

           Mehbooba
పూరీ క‌నెక్ట్స్ అంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఛార్మి పూర్తిగా పూరీకే క‌నెక్ట్ అయిపోతుంద‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు ఆమె పూర్తిగా కేరాఫ్ పూరీ జ‌గ‌న్నాథ్ అయిపోయింది. పూరీకి నీడ‌లా మారిపోయింది అంతే. అత‌డు ఎక్క‌డికి వెళ్తే అక్క‌డ ఛార్మి కూడా ఉండాల్సిందే. అస‌లు ఈ భామ పేరునే మ‌రిచిపోయి చాలా కాల‌మైపోయింది. అప్పుడెప్పుడో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ జ్యోతిల‌క్ష్మి సినిమాతో పూర్తిగా ఫేడ‌వుట్ అయిపోయింది. కానీ ఈమె ఫేడ‌వుట్ అయింది కేవ‌లం సినిమాల‌కే.. సినిమా ఇండ‌స్ట్రీకి కాదు. ప్ర‌స్తుతం ఈమె రాణిలా బ‌తుకుతుంది. అది కూడా ఓ రాజుగారి కోట‌లో. ఆ రాజుగారే పూరీ జ‌గ‌న్నాథ్ అని ఇండ‌స్ట్రీ అంతా కోడై కూస్తుంది. సొమ్మొక‌డిది సోకొక‌డిది అనే సామెత అంద‌రికీ తెలిసిందే. అమ్మాయి గారు ఇప్పుడు కేరాఫ్ పూరీ అంటూ ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య పూరీకి దూరంగా ఉంటుందనే వార్త‌లు వ‌చ్చినా.. అవేవీ నిజం కావ‌ని ఇప్ప‌టికీ పూరీగారితోనే ఛార్మి ఉంద‌ని తెలుస్తోంది. పైగా ఇప్పుడు పూరీ త‌న కొడుకుతో తీస్తోన్న మెహ‌బూబా సినిమాపై చార్మి ఆధిప‌త్యం న‌డుస్తుంద‌నే టాక్ వినిపిస్తుంది.
పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాల‌తో బిజీ.. ఆయ‌న ఆస్తుల‌తో చార్మి బిజీ అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం అంటున్నాయి విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు. ఇప్పుడు మెహ‌బూబా సినిమాను కూడా ఛార్మి త‌న హ్యాండోవ‌ర్ లోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఆమె ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా ప‌ని చేస్తుంది. ఇందుకు గానూ ఏకంగా 4 కోట్ల పారితోషికం ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆమె హీరోయిన్ గా ఉన్న‌పుడు ల‌క్ష‌ల్లోనే ఉన్న ఛార్మి.. ఇప్పుడు మాత్రం కోట్ల‌కు కోట్లు తీసుకుంటుంది. దీనికి కార‌ణం పూరీ అని తెలుస్తోంది. అప్ప‌ట్లో నితిన్ తో పూరీ సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం ఛార్మి చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్ అని ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌యుడి సినిమాకు ఇలాంటి క‌థ‌లే వినిపిస్తున్నాయి. పైగా ఈ చిత్ర షూటింగ్ స‌మ‌యంలోనే పూరీతో క‌లిసి ప‌బ్ లో పీక‌ల‌వ‌ర‌కు తాగి ఫుల్ గా డాన్సులు చేస్తుంది ఛార్మి. మొత్తానికి ఛార్మి య‌వ్వారం ఎంత దూరం వెళ్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here